అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో చైనా యాప్‌లైన టిక్‌టాక్, విచాట్పై విధించిన నిషేధాన్ని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎత్తివేశారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. అదే సమయంలో.. సమాచార భద్రత కోసం 'యూఎస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ సప్లై చైన్'పై కార్యనిర్వాహక ఉత్తర్వులపై కూడా ఆయన సంతకం చేశారు.
"టిక్‌టాక్, విచాట్ సహా 8 ఇతర సాఫ్ట్వేర్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అధ్యక్షుడు బైడెన్ మూడు కార్యనిర్వాహక ఉత్తర్వు(ఈఓ)లపై సంతకం చేశారు."
-శ్వేతసౌధం
గతేడాది ట్రంప్.. టిక్‌టాక్, విచాట్ వంటి చైనా యాప్‌లను అమెరికా యాప్‌స్టోర్ నుంచి తొలిగించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా సంస్థలు తమ కార్యకలాపాలు అమెరికాలో నిర్వహించకుండా నిషేధం విధించారు.
మరోవైపు.. అమెరికా పెట్టుబడులు పొందకుండా 59 చైనా సైనిక, నిఘా సంస్థలపై బైడెన్ ప్రభుత్వం ఈ వారం ప్రారంభంలో నిషేధం విధించింది. వీటిలో 44 కంపెనీలపై ట్రంప్ ఇదివరకే నిషేధం విధించారు.
ఇదీ చూడండి: టిక్ టాక్ ఫౌండర్ ఝాంగ్ సంచలన నిర్ణయం
ఇదీ చూడండి: 92 దేశాలకు 50 కోట్ల టీకా డోసులు: అమెరికా