ETV Bharat / international

అమెరికన్ల రక్షణకు కట్టుబడి ఉన్నాం: బైడెన్​ - బిన్​ లాడెన్​

అల్​ఖైదా అధినేత బిన్​ లాడెన్​ను అమెరికా దళాలు హతమార్చిన సంఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ గుర్తు చేసుకున్నారు. 9/11 దాడులకు ప్రతీకారం తీర్చుకున్నట్టు పేర్కొన్నారు. అమెరికన్లను సురక్షితంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు.

Biden remembers Bin Laden raid, says US will never waver from its commitment to keep American people safe
అమెరిక్ల రక్షణకు కట్టుబడి ఉన్నాం: బైడెన్​
author img

By

Published : May 3, 2021, 9:42 AM IST

కరుడుగట్టిన ఉగ్రవాది, అల్​ఖైదా అధినేత బిన్​ లాడెన్​ను అమెరికా దళాలు హతమార్చి ఆదివారానికి పదేళ్లు పుర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​. అమెరికా ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు.

"9/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మేము సరైన నివాళులు అర్పించాము. వారిని దేశం ఎప్పుడు మరువబోదు. మన దేశంపై మరో దాడి జరగనివ్వకుండా చూసుకుంటామని, అమెరికన్లను సురక్షితంగా ఉంచడానికి కట్టుబడి ఉన్నట్టు మేము ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నాము. 9/11 దాడి జరిగిన 10ఏళ్లకు మేము అఫ్గానిస్థాన్​పై యుద్ధానికి వెళ్లాము. అల్​ఖైదా, దాని నేతలను వెతుక్కుంటూ వెళ్లాము. లాడెన్​ను పట్టుకున్నాము."

--- జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు.

పదేళ్ల క్రితం.. పాకిస్థాన్​లో​ బిన్​ లాడెన్​ నివాసంపై అమెరికా దళాలు దాడులు చేశాయి. దానికి నాటి అధ్యక్షుడు బరాక్​ ఒబామా అధ్యక్షత వహించారు. ఆ సమయంలో బైడెన్​ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

"ఆ క్షణాలను నేను మరచిపోలేను. నిఘావర్గాలు లాడెన్​ను ట్రాక్​ చేయడం.. ఒబామా తీసుకున్న నిర్ణయాలు.. క్షేత్రస్థాయిలో మన దళాలు చూపించిన ధైర్యసాహసాలను నేను మర్చిపోలేను."

--- జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు.

అమెరికా నిత్యం అప్రమత్తంగా ఉంటుందని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని, మిత్రదేశాలతో కలిసి ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కృషి చేస్తుందని స్పష్టం చేశారు బైడెన్​.

ఇదీ చూడండి:- బైడెన్​కు కిమ్​ సర్కార్​ తీవ్ర హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.