అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ త్వరలో వ్యాక్సిన్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ విషయంతో సంబంధం ఉన్న ఒకరు తెలిపారు. రానున్న కొన్ని వారాల్లో బైడెన్ బహిరంగంగా టీకా వేయించుకుంటారని పేర్కొన్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన సతీమణి కారెన్.. శుక్రవారం బహిరంగంగా వ్యాక్సిన్ వేయించుకోనున్నట్లు శ్వేతసౌధం తెలిపింది.
బైడెన్ సహా కమలా హారిస్, ట్రంప్,పెన్స్‌కు వీలైనంత త్వరలో వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సలహా ఇచ్చారు. దీనిపై స్పందించిన బైడెన్.. కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బందికి, వైరస్‌తో ఎక్కువ ప్రమాదం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అయితే అమెరికా ప్రజల్లో టీకాపై విశ్వాసాన్ని నింపడానికి బహిరంగంగా టీకా వేయించుకుంటానని బైడెన్ గతంలో అన్నారు.
ఇదీ చూడండి: 'బైడెన్, ట్రంప్‌లకు కరోనా టీకా ఇవ్వాలి'