2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రాట్ ఆశావహ అభ్యర్థి జో బిడెన్ కేవలం 24 గంటల్లో 6.3 మిలియన్ డాలర్ల ఎన్నికల విరాళాలు సేకరించారు. మిగతా పోటీదారుల కంటే ముందంజలో ఉన్నారు.
ఆన్లైన్ ద్వారా బిడెన్‌కు ఒక్కొక్కరి నుంచి సగటున 41 డాలర్ల విరాళం అందింది. ఈసారి ఆయనకు విరాళాలు ఇచ్చినవారిలో సుమారు 61 శాతం మంది కొత్తవారు. గత ఎన్నికల్లో జో బిడెన్ పోటీ చేసినప్పుడు వీరెవరూ ఆయనకు ప్రచార ఖర్చుల కోసం చందా ఇవ్వలేదు.
టెక్సాస్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ సభ్యుడు, డెమొక్రాట్ ఆశావహ అధ్యక్ష అభ్యర్థి బెటో ఓరూర్కే 24 గంటల్లో 6.1 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న వెర్మోంట్ సెనెటర్ బెర్నీ సాండర్స్‌కు వచ్చిన చందాల విలువ 5.9 మిలియన్ డాలర్లు.
అశావహ అభ్యర్థులందరూ ఇప్పటి నుంచి ఓ సంవత్సరం పాటు ప్రాథమిక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. వారిలో ఒకరు అధికారికంగా పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవుతారు. ఆ వ్యక్తి 2020 నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో తలపడతారు.
ఇదీ చూడండి :ట్రంప్‌పై 'ఫోన్' దాడికి యత్నం.. కొద్దిలో మిస్