అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమోక్రాట్ అభ్యర్థి జోబైడెన్ విజయం సాధించిన వేళ ఆయన పార్టీ మద్దతుదారులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గరకు వేలాదిగా చేరుకున్న బైడెన్ అభిమానులు ఒకరికి ఒకరు అభినందనలు చెప్పుకొన్నారు.
వాషింగ్టన్ డీసీలోని బ్లాక్ లైవ్ మేటర్ స్క్వేర్ వద్దకు భారీగా చేరుకున్న బైడెన్ అభిమానులు.. బైబై ట్రంప్ అంటూ రోడ్లపై రాశారు. శ్వేతసౌథానికి దారితీసే రోడ్లపైకి భారీగా చేరి సంబరాలు చేసుకున్నారు.
ఫిలడెల్ఫియాలోనూ ఇళ్లలో నుంచి రోడ్లపైకి వచ్చి బైడెన్ అభిమానులు డ్యాన్స్‌లు వేస్తూ వేడుకలు చేసుకున్నారు. బైడెన్ పూర్వీకుల నగరం బలీనాలో భారీగా ప్రజలు గుమిగూడి బైడెన్ విజయం పట్ల శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ట్రంప్ అభిమానులు మాత్రం రిపబ్లికన్ల విజయాన్ని డెమోక్రాట్లు అక్రమంగా లాగేసుకున్నారంటూ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు.