ETV Bharat / international

అమెరికా ఆర్థిక మండలి సభ్యుడిగా భారతీయ అమెరికన్​ - Indian American Bharat Ramamurti

భారతీయ అమెరికన్.. భరత్​ రామమూర్తిని జాతీయ ఆర్థిక మండలి(ఎన్​ఈసీ)లో డిప్యూటీ డైరెక్టర్​గా నియమిస్తూ అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం.. రూజ్‌వెల్ట్ ఇన్​స్టిట్యూట్‌లో కార్పొరేట్​ పవర్​ ప్రోగ్రాం మేనేజింగ్​ డైరెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు రామమూర్తి.

Biden names Indian American Bharat Ramamurti as National Economic Council member
అమెరికా ఎన్​ఈసీ సభ్యుడిగా భారతీయ అమెరికన్​
author img

By

Published : Dec 22, 2020, 6:45 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ యంత్రాంగంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది. అమెరికా జాతీయ ఆర్థిక మండలి(ఎన్‌ఈసీ)లో డిప్యూటీ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ భరత్​ రామమూర్తి ఎంపికయ్యారు.

దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక విధాన రూపకల్పన ప్రక్రియను సమన్వయం చేసే ఎన్​ఈసీకి ముగ్గురు సభ్యులను నియమించారు అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్. వారిలో ఆర్థిక విధానంలో అధ్యక్షుడికి ప్రత్యేక సహాయకుడిగా జోయెల్​ గాంబుల్​, ఎన్‌ఈసీ డిప్యూటీ డైరెక్టర్​గా డేవిడ్​ కామిన్​ను ఎంపిక చేశారు బైడెన్​. ఎన్​ఈసీలో ఆర్థిక సంస్కరణలు, వినియోగదారుల రక్షణ విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గా రామమూర్తిని నియమించారు.

రూజ్‌వెల్ట్ ఇన్​స్టిట్యూట్‌లో కార్పొరేట్​ పవర్​ ప్రోగ్రాం మేనేజింగ్​ డైరెక్టర్​గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు రామమూర్తి. గతంలో సీఏఆర్ఈఎస్​(కేర్స్) చట్టంపై వేసిన కాంగ్రెస్ పర్యవేక్షణ కమిషన్‌లో పనిచేయడానికి ఏప్రిల్‌లో రామమూర్తి నియమితులయ్యారు.

2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో సెనేటర్ ఎలిజబెత్ వారెన్​కు ఆర్థిక సలహాదారుగా, ఆమె సెనేట్ కార్యాలయంలో బ్యాంకింగ్​, ఆర్థిక విధానాలకర్తగా పని చేశారు రామమూర్తి. మసాచుసెట్స్‌లో జన్మించిన రామమూర్తి.. హార్వర్డ్ కళాశాల, యేల్​ లా స్కూల్​లో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశారు.

ఇదీ చూడండి: 'పాక్​తో సంబంధాలపై భారత్​కు ఆందోళన వద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.