ETV Bharat / international

ట్రంప్ సహకారం లేకుండానే బైడెన్​ ముందుకెళతారా? - ట్రంప్ వర్సెస్ బైడెన్

అమెరికా ఎన్నికలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరాలు లేవనెత్తుతున్న వేళ కొత్తగా ఎన్నికైన జో బైడెన్​కు అధికార బదిలీ సంక్లిష్టంగా మారనుంది. జాతీయ భద్రతకు కీలకమైన నిఘా సమాచారాన్ని అందజేసేందుకు ట్రంప్ మొండికేస్తుండగా.. బైడెన్​ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ట్రంప్ సహకారం లేకుండానే బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిఘా సమాచారాన్ని పొందాలని బైడెన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

US-TRUMP-BIDEN-INTEL
ట్రంప్ - బైడెన్
author img

By

Published : Nov 12, 2020, 11:28 AM IST

ప్రపంచానికి పెద్దన్నగా అమెరికా అవతరించడానికి కారణం ఆ దేశ నిఘా వ్యవస్థ. ఈ అత్యంత కీలకమైన విభాగం అమెరికా అధ్యక్షుడి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అమెరికా కొత్త అధ్యక్షుడు ఎన్నికైనప్పుడు.. ఆయన బాధ్యతలు తీసుకునే సమయానికి అన్ని అంశాల గురించి తెలుసుకోవటం సాధారణం.

అమెరికా అధ్యక్షుడి రోజువారీ నివేదిక (పీడీబీ)లో జాతీయ భద్రత అంశాలపై ఉన్నత స్థాయి సమాచారం, విశ్లేషణ అందించే సంప్రదాయం 1946 నుంచి కొనసాగుతోంది. సీఐఏ, ఇతర ఏజెన్సీల నుంచి వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం అధ్యక్షుడికి అందజేస్తుంది.

క్లింటన్​-బుష్​ సమయంలో..

దేశ భద్రతకు సంబంధించిన ఈ విషయంలో దిగిపోయే అధ్యక్షుడి సహకారం ఎంతో ముఖ్యం. 2000 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు బిల్​ క్లింటన్​.. కాబోయే అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ విషయంలో ఇలాగే వ్యవహరించారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్​ అయిన క్లింటన్​ ఉపాధ్యక్షుడు అల్ గోరెపై బుష్​ విజయం సాధించారు.

ఓట్ల లెక్కింపుల్లో వివాదాలు నెలకొన్న వేళ న్యాయ ప్రక్రియ ద్వారా బుష్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. బుష్​ రిపబ్లికన్ అయినప్పటికీ నిఘా సమాచారాన్ని అందించేందుకు క్లింటన్ అంగీకరించారు. కానీ, ఆ పద్ధతిని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాటించేందుకు సిద్ధంగా లేరు. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. నిఘా రోజువారీ నివేదికలను కొత్తగా ఎన్నికైన జో బైడెన్​కు అందించేందుకు ట్రంప్ నిరాకరిస్తున్నారు.

ఈరోజే ప్రారంభించాలి..

అయితే, అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేనాటికి జాతీయ భద్రతా సమస్యలపై బైడెన్​కు పూర్తిగా సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ట్రంప్ తన మనసు మార్చుకుంటారని ఇంటెలిజెన్స్ నిపుణులు భావిస్తున్నారు. అధికార బదిలీ జరిగే వరకు డెమొక్రాట్లు వేచి చూడరని భావిస్తున్నట్లు మిషిగన్ మాజీ రిపబ్లికన్ ప్రతినిధి, ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మన్ మైక్ రోజర్స్ అన్నారు.

"ఈ రోజు నుంచే అధ్యక్షుడి రోజువారీ నివేదికలను బైడెన్ అందుకోవాలి. దేశానికి పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవటం ప్రారంభించాలి. ఇది జాతీయ భద్రత అంశం. రాజకీయాలకు సంబంధించిన అంశం ఎంతమాత్రం కాదు."

-మైక్ రోజర్స్

అధ్యక్ష అధికార బదిలీ సమయాన్ని అమెరికా ప్రత్యర్థులు అవకాశంగా తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ఫలితంగా బైడెన్ అధికారం చేపట్టేనాటికి కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వీటిల్లో కొన్ని...

అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవానికి ముందే రష్యాతో కొత్త అణ్వాయుధ ఒప్పందాన్ని పొడిగించడం లేదా చర్చలు జరపాల్సి ఉంది. లేదా దీనిపై బైడెన్​ స్పందించడానికి 16 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈ చర్చలకు సంబంధించి రష్యా లేవనెత్తే అభ్యంతరాలపై అమెరికా గూఢచారులు వివరాలు సేకరిస్తారు.

రష్యాతోపాటు చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, ఉగ్రవాదులతో ముప్పుపై అధ్యక్షుడికి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. ఈ వివరాలన్నీ అధ్యక్షుడి రోజువారీ నివేదికల్లో ఉంటాయి.

నిర్లక్ష్యంగానే బైడెన్!​

ఇంత ప్రాధాన్యం ఉన్న పీడీబీపై దృష్టి సారించేందుకు బైడెన్​ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. "పీడీబీ అవసరమైన అంశమే. కానీ తప్పనిసరి కాదు. నేను ఇంకా అధ్యక్షుడి స్థానంలో కూర్చోలేదు కదా" అని బైడెన్ మంగళవారం అన్నారు. ఈ విషయంపై ట్రంప్​ను సంప్రదించారా లేదా అనే విషయాన్ని బైడెన్ వెల్లడించలేదు. దీన్ని బట్టి ట్రంప్ సహకారం లేకుండానే బైడెన్​ అధ్యక్షుడైన తర్వాత ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పొందాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే, ఒబామా హయాంలో పీడీబీపై బైడెన్​కు పట్టు ఉంది. కానీ, ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతుంటాయి. ఈ విషయంలో బైడెన్​కు ట్రంప్ అవసరం ఎంతో ముఖ్యం.

ఇదీ చూడండి: అలస్కాలో ట్రంప్​ విజయం- జార్జియాలో రీకౌంటింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.