అమెరికా ప్రజల్ని ఉద్దేశించి ఈస్టర్ పండుగ సందర్భంగా అధ్యక్షుడు జోబైడెన్ చేసిన ప్రసంగంలో హోలీ గురించి ప్రస్తావించారు. గత వారం రంగుల పండుగ జరుపుకొన్నారని, ఇప్పుడు ఈస్టర్.. కొన్ని రోజులలో రంజాన్ వస్తుందని అన్నారు.
అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మానవులందరూ సమానమని బైడెన్ అన్నారు. పండుగలు అందరిని కలిపి ఉంచుతాయని తెలిపారు.
అయితే ప్రజలు మాస్క్ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా తిరుగుతున్నారని, దీని వల్ల కరోనా తీవ్రంగా వ్యాపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారని బెడైన్ పేర్కొన్నారు. ఇప్పుడు అదే తనను అందోళనకు గురిచేస్తోందని చెప్పారు. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
గత వారం హోలీ పండుగ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ శుభాకాంక్షలు తెలిపారు . అగ్రరాజ్య ఉపాధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి హోలీ శుభాకాంక్షలు చెప్పడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇదీ చదవండి: మయన్మార్ వేదికగా చైనా విస్తరణ కుట్రలు