Street Fight Person dead In kukatpally : తమ సోదరిని వేధిస్తున్నాడనే కారణంగా ఓ వ్యక్తిని ఆమె సోదరులు దాడి చేసి చంపిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది : వెంకటరమణ అనే వ్యక్తి ఈ నెల 22వ తేదీన రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించి టీ తాగేందుకు వచ్చారు. అదే సమయంలో శ్రీధర్, అజయ్, పవన్, సురేష్‌లు తమ సిస్టర్స్‌తో పాటు అక్కడికి టీ తాగేందుకు వచ్చారు. శ్రీధర్ సోదరిపై వెంకటరమణ కామెంట్ చెయ్యడంతో ఆ నలుగురు అతడిపై దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న ఓ టిఫిన్ సెంటర్లోని చపాతీ కర్రతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో వెంకట రమణ మృతి చెందాడు.
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ : ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తున్నామని కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజు కూకట్‌పల్లి పోలీస్ స్టేషనులో మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా చిన్నిపాలెంకు చెందిన గంటిమల్ల వెంకట రమణ(22) మూసాపేట్లో నివసిస్తూ, ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 22వ తేదీన తన స్నేహితులతో మద్యం సేవించి, కూకట్‌పల్లి బీజేపీ ఆఫీస్ వద్దకు టీ తాగేందుకు వచ్చారు.
అదే సమయంలో పవన్, శ్రీధర్, సురేష్, అజయ్ కుమార్‌లు తమ సిస్టర్స్‌తో కలిసి టీ తాగేందుకు వచ్చారు. పవన్ సోదరిపై వెంకట రమణ కామెంట్ చెయ్యటంతో, ఆ నలుగురు వెంకట రమణపై దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న ఓ టిఫిన్ సెంటర్లోని చపాతీ కర్రతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో వెంకటరమణ తరువాత రోజు స్పృహ తప్పి పడిపోవడంతో, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా, అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకట రమణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి, రిమాండుకు తరలించినట్లుగా ఏసీపీ తెలిపారు.
స్వీట్ షాప్ యజమానిపై పిడిగుద్దులతో రెచ్చిపోయిన యువతి, యువకుడు
దారిన పోయే వ్యక్తిని డబ్బులడిగాడు - లేవన్నందుకు అందరూ చూస్తుండగానే కొట్టి చంపాడు