ETV Bharat / international

'2024 ఎన్నికల్లో నా ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిసే' - కమలా హారిస్ జో బైడెన్

Biden Kamala running mate: అమెరికా తదుపరి ఎన్నికల్లో తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిసే ఉంటారని అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. కమల పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. ఉపాధ్యక్షురాలు బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. మరోవైపు, రష్యాకు తీవ్ర హెచ్చరికలు చేశారు బైడెన్. చైనాపై విధించిన ఆంక్షలు ఇప్పట్లో తొలగించే అవకాశం లేదన్నారు.

biden us kamala
biden us kamala
author img

By

Published : Jan 20, 2022, 8:26 AM IST

Updated : Jan 20, 2022, 8:50 AM IST

Biden Kamala running mate: 2024 ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్​నే ఎంచుకుంటానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కమలా హారిస్ పనితీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారా అనే ప్రశ్నకు అవును అని సమాధానమిచ్చారు. 'ఆమె పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నా. నా తదుపరి ఉపాధ్యక్ష అభ్యర్థి కూడా ఆమెనే. ఓటింగ్ హక్కుల విషయంలో ఆమెను నేనే ఇంఛార్జిగా నియమించా. ఆమె బాగా పనిచేస్తున్నారు' అని బైడెన్ వివరించారు.

US First female vice president

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన తొలి మహిళా, నల్లజాతి, భారతీయ అమెరికన్​ కమలా హారిసే కావడం విశేషం. భారత్, జమైకా దేశాలకు చెందిన తల్లిదండ్రులకు కమల జన్మించారు. కాలిఫోర్నియాలోని బెర్క్​లీలో పెరిగారు. 2019 ఆగస్టులో జో బైడెన్.. తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలను ఎన్నుకున్నారు. 2020 నవంబర్​లో జరిగిన ఎన్నికల్లో ఇరువురూ ఘన విజయం సాధించారు.

China US trade war

మరోవైపు, చైనా ఎగుమతులపై విధించిన సుంకాలను తగ్గించేందుకు సిద్ధంగా లేనని జో బైడెన్ స్పష్టం చేశారు. సుంకాలు తగ్గించాలని అమెరికా వ్యాపారుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ.. దీనిపై కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యపై సమాలోచనలు చేస్తున్నామని, అయితే ప్రస్తుతానికైతే పరిస్థితి అనిశ్చితితో కూడుకొనన్నదని బైడెన్ పేర్కొన్నారు. ట్రంప్ హయాంలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలోని వాగ్దానాలను చైనా నెరవేర్చితే.. కొన్ని ఆంక్షలను ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే పరిస్థితి అంతవరకు రాలేదని చెప్పారు.

Biden warns Russia Ukraine

అదేసమయంలో రష్యాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు బైడెన్. ఉక్రెయిన్​పై సైనిక చర్యకు తెగబడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పూర్తిస్థాయి యుద్ధం జరగాలని వ్లాదిమిర్ పుతిన్ కోరుకోవడం లేదనే ఆశిస్తున్నానని చెప్పారు. సైబర్ దాడులు వంటి సైనికేతర చర్యలకు పాల్పడినా దీటుగా తిప్పికొడతామని అన్నారు. ఉక్రెయిన్​పై తీసుకునే నిర్ణయం పూర్తిగా పుతిన్ చేతుల్లోనే ఉందన్నారు. శ్వేతసౌధ అధికారులతో చర్చలు జరుపుతున్న రష్యా ఉన్నతాధికారుల వద్ద కూడా దీనిపై సరైన సమాచారం లేదని చెప్పారు.

దేశంలో కరోనాపై

రికార్డు స్థాయి కేసులతో అమెరికా అల్లాడుతున్న నేపథ్యంలో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాతో అమెరికన్లు నిరుత్సాహానికి గురవుతున్నారని, అయితే మహమ్మారిపై అంచనాల కంటే మెరుగ్గానే పనిచేసినట్లు చెప్పారు. పరిస్థితి ఇప్పుడే ముగిసిపోలేదని.. మంచి రోజులు ముందున్నాయని అన్నారు.

మరోవైపు, ఆర్థిక ప్యాకేజీకి కాంగ్రెస్ ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2022 మధ్యంతర ఎన్నికల నాటికి ఈ బిల్లు పాస్ అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీకి ఆమోదం లభిస్తే డెమొక్రాట్లను ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పుకొచ్చారు. దీనిపై దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 5G Services In USA: అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం

Last Updated : Jan 20, 2022, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.