అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. పాలనాయంత్రాంగంపై దృష్టిపెట్టారు. తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్పీకర్గా ఉన్న పెలోసీ.. మరోసారి ఆ పదవికి నామినేట్ అయ్యారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు జో బైడెన్.
"దేశంలో కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే అజెండాతో డెమొక్రటిక్ నాయకత్వంలో ఆమెతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను"
- జో బైడెన్, కాబోయే అమెరికా అధ్యక్షుడు
తమ నాయకులను ఎన్నుకోవటానికి డెమొక్రటిక్ పార్టీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఎక్కువమంది పెలోసీని బలపరిచారు. దీంతో ఆమె వచ్చే రెండేళ్లలో స్పీకరు బాధ్యతను నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: బైడెన్ మంత్రివర్గంలో ఇద్దరు భారతీయ అమెరికన్లు!