ETV Bharat / international

'యుద్ధ నివారణకే ఇండో పసిఫిక్​లో అమెరికా సైన్యం' - ఇండో పసిఫిక్​లో అమెరికా సైన్యం

అమెరికా పోటీతత్త్వాన్ని ఆహ్వానిస్తుంది తప్ప.. యుద్ధ వాతావరణాన్ని కాదని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. యుద్ధాన్ని నివారించేందుకే ఇండో పసిఫిక్​లో అమెరికా తన సైన్యాన్ని ఉంచుతోందని చెప్పారు. ఈ సందర్భంగా చైనాకు పరోక్ష హెచ్చరికలు చేశారు.

Biden calls trillion-dollar jobs plan as way to counter China
జో బైడెన్
author img

By

Published : Apr 29, 2021, 12:00 PM IST

ఇండో పసిఫిక్ తీరంలో సంఘర్షణ నిరోధానికే ఆ ప్రాంతంలో శక్తిమంతమైన సైన్యాన్ని ఉంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అక్కడున్న భారీ సైనిక శక్తి యుద్ధం కోసం కాదని, యుద్ధ నివారణకేనని చెప్పారు. అమెరికా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన బైడెన్‌.. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సందేశం ఇచ్చినట్లు తెలిపారు. తాము పోటీతత్త్వాన్ని ఆహ్వానిస్తామని అంతేకానీ, యుద్ధ వాతావరణాన్ని కాదని బైడెన్ ఉద్ఘాటించారు.

అమెరికన్ల ప్రయోజనాలను కాపాడి తీరుతామని తేల్చి చెప్పారు బైడెన్. అమెరికా సంస్థలకు నష్టం చేకూర్చేలా, అమెరికన్ల ఉద్యోగాలు కోల్పోయేలా చేసే ఏ విధమైన వాణిజ్య పంథాను సహించేది లేదని చైనాకు పరోక్ష హెచ్చరికలు చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనపై, ప్రజల స్వాతంత్ర్యానికి సంబంధించి ఇతర దేశాధినేతలకు చెప్పినట్లే జిన్‌పింగ్‌కు కూడా తేల్చి చెప్పినట్లు బైడెన్ వివరించారు. ఏ దేశంలోనైనా మనుషుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంటే ఏ అమెరికా అధ్యక్షుడు కూడా సహించబోరని అన్నారు.

అమెరికన్ల కోసం ఉద్యోగ ప్రణాళిక

చైనాతో పోటీని ఎదుర్కొంటున్నామని చెప్పిన బైడెన్.. దేశీయ పెట్టుబడులు పెట్టడమే ఆ దేశంపై విజయం సాధించడానికి మార్గమని అన్నారు.

"21వ శతాబ్దాన్ని గెలుచుకునేందుకు చైనాతో మనం పోటీ పడుతున్నాం. మనం అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ఇంకా ఎక్కువ చేయాలి. బీజింగ్​లో తయారుచేసే విండ్ టర్బైన్ బ్లేడ్లను పిట్స్​బర్గ్​లో ఎందుకు తయారు చేయకూడదనేందుకు కారణాలు లేవు. విద్యుత్ వాహనాలు, బ్యాటరీల తయారీలో ప్రపంచ అగ్రగామిగా అమెరికన్లు నిలవకుండా ఉండేందుకు కారణాలు లేవు. ప్రజా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన అమెరికాను పూర్తిగా మార్చేశాయనేందుకు చరిత్రే తార్కాణం."

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ఈ సందర్భంగా అమెరికన్ల కోసం ఉద్యోగ ప్రణాళికపై కీలక ప్రకటన చేశారు బైడెన్. ఈ ప్రణాళిక.. అమెరికన్ల కోసం లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని చెప్పారు. అమెరికా వస్తువులు కొనుగోలు అనే సూత్రంతో ఈ ప్రణాళికపై పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. దీనికి అమెరికా కాంగ్రెస్ మద్దతివ్వాలని కోరారు. ఈ అంశంపై.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా డెమొక్రటిక్, రిపబ్లికన్ ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి- 'సంక్షోభం నుంచి అవకాశాల దిశగా అమెరికా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.