ETV Bharat / international

'శ్వేతసౌధం నుంచి ట్రంప్​ను సైన్యమే ఖాళీ చేయిస్తుంది' - అమెరికా అధ్యక్ష ఎన్నికలు

నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ డొనాల్డ్​ ట్రంప్​ ఓడిపోయి శ్వేతసౌధాన్ని వీడేందుకు నిరాకరిస్తే సైన్యమే ఆయన్ను ఖాళీ చేయిస్తుందన్నారు జో బైడెన్​. తాను అధికారంలోకి వస్తే పౌర, సైనిక శక్తుల విభజనను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు.

Biden, aiming at Trump, says he won't use military as 'prop'
'శ్వేతసౌధం నుంచి ట్రంప్​ను సైన్యమే ఖాళీ చేయిస్తుంది'
author img

By

Published : Aug 30, 2020, 11:24 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై విమర్శల పదును పెంచారు డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​. సైన్యాన్ని ట్రంప్​ తన సొంత ఆస్తిలా వినియోగించారని, తాను అలా చేయబోనన్నారు. వ్యక్తిగత ప్రతీకారాలు, పౌర హక్కులు ఉల్లంఘించేలా సైన్యాన్ని ట్రంప్ ఉపయోగించారని ఆరోపించారు. నేషనల్​ గార్డ్​ అసోసియేషన్ శనివారం నిర్వహించిన వర్చువల్​ ర్యాలీలో ప్రసంగించారు బైడెన్​. ఒకవేళ నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడకపోతే సైన్యమే ఆయన్ను ఖాళీ చేయిస్తుందన్నారు.

తాను అధికారంలోకి వస్తే పౌర, సైనిక శక్తుల విభజనను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు బైడెన్​. అమెరికా ప్రజలకు శాంతియుత నిరసనలు చేపట్టే హక్కు ఉందన్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​ ప్రసంగంతో బైడెన్​కు తగ్గిన మద్దతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.