ETV Bharat / international

దేశవ్యాప్తంగా మాస్కుల పంపిణీకి బైడెన్ సిద్ధం - బైడెన్​ అమెరికా అధ్యక్షుడు

దేశవ్యాప్తంగా మాస్కులు పంపిణీ చేయాలని బైడెన్​ సర్కార్​ నిర్ణయించింది. అమెరికాలో వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Biden
దేశవ్యాప్తంగా మాస్కుల పంపిణీకి బైడెన్ సిద్ధం
author img

By

Published : Feb 24, 2021, 5:30 AM IST

లక్షల సంఖ్యలో మాస్కులను దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయించారు.​ అతి త్వరలోనే ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు బైడెన్ తెలిపారు. అయితే ట్రంప్​ సర్కార్​ ఈ కార్యక్రమాన్ని చేపడదామనుకుని వెనుకడుగు వేసింది.

అయితే ఈ కార్యక్రమం వివరాలు, వ్యయం, ఎప్పుడు మొదలుపెడతారు, ఎలాంటి మాస్కులు ఇస్తారనే విషయాన్ని శ్వేతసౌధం ఇంకా తెలుపలేదు.

బైడెన్​ అధికారంలోకి వచ్చిననాటి నుంచి మొదటి 100 రోజులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు. వాటితో పాటు ప్రజారవాణా, కార్యాలయాల్లోనూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు బైడెన్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.