ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమ వ్యూహాత్మక విధానాలు అమలు చేసేందుకు 'క్వాడ్' ప్రాథమిక పునాదిగా అధ్యక్షుడు జో బైడెన్ బృందం భావిస్తోందని అమెరికాకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. 'క్వాడ్'లో జపాన్, భారత్, ఆస్ట్రేలియాలతో పాటు అమెరికా సభ్య దేశంగా ఉంది.
నాలుగు దేశాలు సభ్యత్వం కలిగిన క్వాడ్‌ను అమెరికా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్ అన్నారు. క్వాడ్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత లోతుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు.. యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలిపారు. ఇండో-పసిఫిక్ పాలసీ, క్వాడ్‌లో సభ్యత్వం మొదలైనవి గతంలో ట్రంప్ బృందం చొరవతోనే సాధ్యమైనట్లు గుర్తుచేశారు. వీటిని కొనసాగించేందుకు బైడెన్ బృందానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
చైనా దురాక్రమణ చర్యలకు అడ్డుకట్టు వేసేందుకు నాలుగు దేశాలు కలిసి 2017లో 'క్వాడ్'ను ఏర్పాటు చేశాయి.
ఇదీ చదవండి:అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం