ETV Bharat / international

హెచ్​-1బీ వీసాలపై ఎటూ తేల్చని బైడెన్ - హెచ్​-1బీ వీసా భారత్

ఇమ్మిగ్రేషన్​ సహా పలు విధానాలపై ట్రంప్​ తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్​ రద్దు చేశారు. అయితే హెచ్​-1బీ వీసాల జారీపై ట్రంప్​ విధించిన నిషేధాన్ని తొలిగించే అంశంపై మాత్రం బైడెన్​ ఎటూ తేల్చలేదు. ప్రస్తుతం మార్చి 31 వరకు హెచ్​-1బీ వీసాల జారీపై నిషేధం అమలులో ఉంది.

Biden
హెచ్​-1బీ వీసాలపై ఎటూ తేల్చని బైడెన్
author img

By

Published : Mar 2, 2021, 10:48 AM IST

అమెరికాలో విదేశీ నిపుణులకు అందించే హెచ్‌-1బీ వీసాల జారీపై ట్రంప్‌ విధించిన నిషేధాన్ని తొలగించే అంశంపై బైడెన్‌ సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని అమెరికా హోంల్యాండ్‌ భద్రతా కార్యదర్శి అలెజాండ్రో మేయర్‌కాస్‌ తెలిపారు. హింసకు గురి అవుతున్న వారి అవసరాలను తీర్చడానికే ప్రస్తుతం తాము అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు.

హెచ్​-1బీ వీసాల జారీ నిలిపివేతను మార్చి 31 వరకు పొడిగిస్తూ జనవరిలో ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అధికారం చేపట్టిన నాటి నుంచి ట్రంప్‌ హయాం నాటి నిర్ణయాలను బైడెన్​ రద్దు చేస్తూ వస్తున్నారు. హెచ్​-1బీ జారీ నిలుపుదలపై మాత్రం చర్య తీసుకోలేదు. ఈ విషయమై తనకు వివరాలు తెలియవని అలెజాండ్రో మీడియాతో అన్నారు. అమెరికా పునరుద్ధరణ, పునర్‌నిర్మాణం కోసం తమ యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు.

'హెచ్‌-1బీ' అనేది వలసేతర వీసా. నిపుణులైన విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఈ వీసా విధానం అమెరికా కంపెనీలకు వీలు కల్పిస్తుంది. దాని ద్వారా భారత్‌, చైనా తదితర దేశాల నుంచి ఏటా వేల సంఖ్యలో ఐటీ నిపుణులు అమెరికా వెళ్లగలుగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.