ETV Bharat / international

హెచ్​1-బీ వీసాలపై బైడెన్ మరో కీలక నిర్ణయం! - హెచ్​-1బీ వీసా నిబంధనలపై బైడెన్ ప్రభుత్వం నిర్ణయాలు

హెచ్​-1బీ వీసాలకు సంబంధించి వివాదాస్పదంగా మారిన మరో అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కనీస వేతన పరిమితి పెంపు నిబంధన అమలును వాయిదా వేసేందుకు తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేసిది.

Biden admin issues new notification on H-1B visa
వీసాలపై ట్రంప్ వివాదాస్పద విధానాలు సమీక్షిస్తున్న బైడెన్​
author img

By

Published : Mar 12, 2021, 4:54 PM IST

Updated : Mar 12, 2021, 5:38 PM IST

హెచ్​-1బీ వీసా పొందే వారికి కనీస వేతన పరిమితి పెంచాలని ట్రంప్ హయాంలో ప్రతిపాదించిన నిబంధన అమలును మరింత ఆలస్యం చేసేందుకు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ పాలనా యంత్రంగం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఈ అంశాన్ని సమీక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయం తెలిపేందుకు అవకాశం కల్పించనున్నట్లు కార్మిక శాఖ నోటిఫికేషన్​లో పేర్కొంది.

ఈ నిబంధనలు జూన్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉండగా... 60 రోజులు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

ట్రంప్ ప్రతిపాదన ఇది..

సాధారణంగా హెచ్​1-బీ వీసా పొందాలంటే వార్షికవేతనం కనీసం 65 వేల డాలర్లకుపైగా ఉండాలి. అయితే ట్రంప్ హయాంలో ఈ పరిమితిని 1.10 లక్షల డాలర్లకు (45 శాతం) పెంచాలని ప్రతిపాదించారు. దీని వల్ల అమెరికా పౌరులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ట్రంప్ అప్పట్లో పేర్కొన్నారు.

హెచ్​-1బీ వీసా అనేది నాన్​ ఇమిగ్రెంట్ వీసా. ఈ వీసా ఉన్న వారు అమెరికా కంపెనీల్లో ఉపాధి పొందొచ్చు. అయితే ఆయా కంపెనీలు విదేశీ సిబ్బందిని నియమించుకోవాలంటే.. వారిలో ప్రత్యేక నైపుణ్యాలు తప్పనిసరి. ఇదే పద్ధతిలో అమెరికా టెక్​ కంపెనీలు ఏటా వేల సంఖ్యలో భారత్, చైనా వంటి దేశాల నుంచి నిపుణులైన సిబ్బందిని నియమించుకుంటున్నాయి.

ఇదీ చదవండి:'హెచ్​-1బీ' జారీ నిర్ణయంపై ఫెయిర్​ అభ్యంతరం

Last Updated : Mar 12, 2021, 5:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.