ETV Bharat / international

బైడెన్​ కోసం తొలిసారి ప్రజల ముందుకు ఒబామా - అమెరికా అధ్యక్ష ఎన్నికలు

అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ కోసం మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా ప్రచారంలో పాల్గొననున్నారు. అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ కోసం మొదటి సారి ప్రజల ముందుకు ప్రత్యక్షంగా రానున్నారు. ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించే రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలో ఈ ప్రచారం జరగనుంది.

US-BIDEN-OBAMA
ఒబామా
author img

By

Published : Oct 22, 2020, 5:02 AM IST

డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా మొదటిసారి ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా రానున్నారు. డెమొక్రటిక్ పార్టీలో మంచి వక్తగా పేరొందిన ఒబామా.. కరోనా నేపథ్యంలో 'డ్రైవ్​ ఇన్​ కార్ ర్యాలీ' నిర్వహించనున్నారు.

అమెరికా ఎన్నికల్లో విజయానికి పెన్సిల్వేనియా కీలక రాష్ట్రాల్లో ఒకటి. ఇక్కడ ఒబామా పోటీలో ఉన్న 2008, 2012లో డెమొక్రాట్లే విజయం సాధించారు. గత ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు చెందిన రిపబ్లికన్ పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి ట్రంప్​ కన్నా బైడెన్​ ముందంజలో ఉన్నట్లు వస్తోన్న వార్తల నడుమ రాష్ట్రంలో గెలుపు తమదేనని డెమొక్రాట్లు ధీమాగా ఉన్నారు.

అదే వేదికగా..

2016 ఎన్నికల ముందు రోజు ఇదే ఫిలడెల్ఫియాలోని 'ఇండిపెండెన్స్​ మాల్'​లో అప్పటి అభ్యర్థి హిల్లరీ క్లింటన్​ ప్రచార ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఒబామా. మళ్లీ అదే నగరంలో బైడెన్​ కోసం ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.

ముందస్తు ఓటింగ్ కోసం..

అమెరికా ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి. ఆ రోజు కుదరని వారు ముందుగానే ఓటు వేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ నేపథ్యంలో అందరూ ముందస్తు ఓటింగ్​కు సిద్ధం కావాలంటూ ఒబామా ఈ రాష్ట్రంలో ప్రచారం చేస్తారు. కారులో నుంచే ప్రచార ర్యాలీని నిర్వహిస్తారు.

ఫండ్​ రైజింగ్​లో..

ఇప్పటికే డెమొక్రాట్ల తరఫున నిధుల సేకరణకు ప్రచారం నిర్వహించారు ఒబామా. ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​తో కలిసి రెండు వర్చువల్​ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూన్​లో బైడెన్​తో కలిసి 7.6 మిలియన్ డాలర్ల నిధులను సేకరించారు.

ఇదీ చూడండి: అధ్యక్ష బాధ్యతలు ట్రంప్​ వల్లకాని విషయం: ఒబామా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.