గాలితో నిండిన ఓ చిన్న ప్లాస్టిక్ బ్యాగ్ రూ.ఐదు లక్షల పైనే వేలంలో అమ్ముడుపోయింది. కొంచెం వింతగా.. ఆశ్చర్యకరంగా ఉన్నా.. తప్పదు మరి!. నమ్మి తీరాల్సిందే. అమెరికన్ ర్యాపర్ కేన్ వెస్ట్ నిర్వహించిన ఓ మ్యూజిక్ షో నుంచి తీసుకొచ్చిన ఎయిర్ బ్యాగ్.. మార్కెట్ బిడ్డింగ్‌లో ఇంత ధర పలికి ఇలా అందరినీ ఆశ్చర్యపరిచింది.
-
History repeats itself. pic.twitter.com/LhDgrghSRo
— Photos Of Kanye West (@PhotosOfKanye) July 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">History repeats itself. pic.twitter.com/LhDgrghSRo
— Photos Of Kanye West (@PhotosOfKanye) July 23, 2021History repeats itself. pic.twitter.com/LhDgrghSRo
— Photos Of Kanye West (@PhotosOfKanye) July 23, 2021
అట్లాంటాలోని మెర్సిడెస్ బెంజ్ స్టేడియం నుంచి తీసుకువచ్చినట్లుగా.. ఆన్లైన్లో ఆ ఎయిర్ బ్యాగును పెట్టిన వ్యక్తి పేర్కొన్నాడు. అంతేకాకుండా మ్యుజీషియన్ కేన్ వెస్ట్‌ను కూడా దానికి కనెక్ట్ చేశాడు. జిప్ బ్యాగులో గాలిని తీసుకువచ్చినట్లు వెల్లడించాడు. 'ఎయిర్ ఫ్రం డోండా డ్రాప్' అనే క్యాప్షన్‌ను తగిలించాడు.
వేలంలో ఇలా
అయితే సెల్లర్ దానిని మొదట రూ.2,45,000కు అమ్మనున్నట్లు బ్యాగు లేబుల్‌పై రాశాడు. కానీ వేలంలో అమాంతం ధర పెరిగిపోయింది. అంతేకాదు. డెలివరీ ఛార్జీలు కూడా కొనుగోలుదారుడు చెల్లించాలి.
ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.
ఎవరీ కేన్ వెస్ట్..
కేన్ వెస్ట్ ఓ పాపులర్ ర్యాపర్. అతని షోలకు గొప్ప ప్రజాదరణ ఉంటుంది. ఆగష్టు 6న అట్లాంటాలోని మెర్సిడెస్ బెంజ్ స్టేడియంలో డొండా ఈవెంట్‌ను నిర్వహించారు. షోలు నిర్వహించే సమయంలో స్టేడియంలోనే వెస్ట్ నివసిస్తాడు.
ఇదీ చదవండి: