మహమ్మారి మనకు చాలా అలవాట్లు, పద్ధతులను నేర్పింది. వాటిల్లో కొన్నింటిని మరచిపోవడం కష్టం. ముఖ్యంగా క్రమం తప్పకుండా చేతులు శానిటైజ్ చేసుకోవడం, పరిశుభ్రంగా ఉండటం వంటి వాటి ప్రాముఖ్యత తెలుసుకున్నాం. మాల్స్ నుంచి రెస్టారెంట్ల వరకు ఎక్కడికెళ్లిన శానిటైజర్ దర్శనమివ్వడం పక్కా. ఇక ఈ మహమ్మారి సమయంలో పుట్టిన పిల్లలు.. వారి తల్లిదండ్రులు, పెద్దలు నిత్యం చేతులను శానిటైజ్ చేసుకుంటూ ఉండటాన్ని చూస్తూ పెరిగారు. ఆ బుడతలు కూడా అదే అలవాటు చేసుకున్నారు. ఎంతలా అంటే.. 2020లో జన్మించిన ఓ చిన్నారి.. చూసిన ప్రతీది శానిటైజర్ అనే అనుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
వీధి దీపాల నుంచి విద్యుత్ సర్క్యూట్ల వరకు ప్రతి దాన్ని శానిటైజర్‌గా పొరబడి, దాని ముందు చేతులు చాస్తోంది ఆ చిన్నారి. ఎంతో ముద్దుగా ఉన్న ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే దానికి 18లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.
ఇదీ చూడండి: అమ్మో.. ఆరున్నర అడుగుల జుట్టా?