ETV Bharat / international

అన్నింటా బద్ధవైరం.. ఇద్దరూ మందుకు దూరం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఆయన ప్రత్యర్థి జో బైడెన్​ బద్ధశత్రువుల్లా వ్యవహరిస్తుంటారు. కానీ, వారిద్దరూ ఓ విషయంలో మాత్రం ఏకతాటిపై నిలబడతారు. మద్యానికి ఆమడ దూరం ఉంటారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో.. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

TRUMP_BIDEN
ఆ విషయంలో ఏకతాటిపై ఉన్న ట్రంప్​, బైడెన్​
author img

By

Published : Nov 1, 2020, 2:17 PM IST

ప్రతి విషయంలోనూ ఉప్పు-నిప్పుగా ఉన్న డొనాల్డ్‌ ట్రంప్, జో బైడెన్‌లు ఒక విషయంలో మాత్రం ఏకతాటిపై నిలబడతారు! ఆగర్భ శత్రువుల్లా అధ్యక్ష పదవికి పోరాడుతున్న ఈ ఇద్దరినీ కలుపుతోంది- మందు! అలాగని ఇద్దరూ మందు మిత్రులనుకుంటే పొరపాటు. ఇద్దరూ మద్యానికి ఆమడదూరమే. కానీ, కారణాలు దాదాపు ఒకేలా ఉండటం విశేషం.

తన పెద్దన్న ఫ్రెడ్‌ కారణంగా ట్రంప్‌ మందుకు దూరమైతే, తాను ఆదర్శంగా భావించిన దగ్గరి బంధువొకరు తాగుడుకు బానిస కావటం చూసి ఏహ్య భావంతో మందును వద్దనుకున్నారు బైడెన్‌! ప్రతిరోజూ కచ్చితంగా ఇంటికి వెళ్లేలా బైడెన్‌ తన షెడ్యూల్‌ను రూపొందించుకుంటే.. టీవీ చూస్తూ గడపటానికి ట్రంప్‌ ప్రాధాన్యం ఇచ్చేవారు. అలా ఇద్దరూ మందుకు దూరంగా ఉండేలా ప్రాధమ్యాలను మార్చుకున్నారు. మందు తాగేందుకు అవసరమైన సమయం లేకుండా వారు తమ జీవితాలను మలచుకున్నారని బైడెన్‌ జీవితకథా రచయిత ఇవాన్‌ ఓస్నోస్‌ చెబుతారు.

" మా పెద్దన్న ఫ్రెడ్‌ చాలా మంచి మనిషి. కానీ మందుకు బానిసై.. దాని కారణంగానే చనిపోయారు. అప్పట్నుంచి నేనెన్నడూ మందు ముట్టనని నిర్ణయించుకున్నా. నా పిల్లలకు కూడా రోజూ అదే నూరిపోస్తుంటా! మాదక ద్రవ్యాలు, మద్యం, సిగరెట్లకు దూరంగా ఉంటా. మందు విషయంలో నా పిల్లలతో చాలా కఠినంగా వ్యవహరిస్తా" అని ట్రంప్​ తెలిపారు.

"సమావేశాలు, వ్యాపార సదస్సులు, ఒప్పందాలకు వెళ్ళినా ట్రంప్‌ ఎంతో నిగ్రహంతో ఉంటారు. అంతా తాగుతుంటే తాను మాత్రం వ్యాపారం చక్కబెట్టుకుంటారు. ఎవ్వరేమన్నా పట్టించుకోరు. రాత్రి ఇంట్లో టీవీ చూస్తూ బర్గర్‌ తింటూ గడుపుతారు"

-ఓబ్రెయిన్, రచయిత(ట్రంప్​ జీవిత కథ రాశారు).

ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రిపబ్లికన్‌ అభ్యర్థి మైక్‌ పెన్స్‌ కూడా మందుకు దూరమే. డెమోక్రాట్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ ఈ ముగ్గురికీ భిన్నం!

ఇదీ చదవండి:'బైడెన్ నా సోదరుడు'- 'ట్రంప్ ఓ యోధుడు'

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ట్రంప్​, బైడెన్​లు విమర్శల పదును పెంచుతున్నారు. పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.

బైడెన్‌ రాజకీయజీవితం అవినీతిమయం

ఎన్నికల గడువు సమీపించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తన ప్రత్యర్థి జో బైడెన్‌పై ఆరోపణలు తీవ్రతరం చేశారు. బైడెన్‌ లంచగొండి రాజకీయ నాయకుడని, 47 ఏళ్లుగా అమెరికన్లకు నమ్మకద్రోహం చేస్తున్నారన్నారు. శుక్రవారం మిన్నెసోటాలోని రోచస్టర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌ ప్రసంగించారు. బైడెన్‌కు అధికార యావ తీవ్రంగా ఉందని, ఇందుకోసం ఎవరినైనా వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడని విమర్శించారు.

'మీ కుటుంబాన్ని, దేశాన్ని రక్షించుకొనేందుకు. అమెరికా జీవనశైలిని సంరక్షించుకొనేందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. నవంబరు 3న మీరంతా ఓటు వేయడమే ఆ మార్గం. బైడెన్‌ను ఓడించి అమెరికా స్వాతంత్య్రాన్ని కాపాడండి' అని ట్రంప్ కోరారు.

బైడెన్‌ గత 47 ఏళ్లుగా రాజకీయాల్లో అఫ్రికన్‌-అమెరికన్లను దారుణంగా మోసం చేస్తున్నారని, వాళ్లని సూపర్‌ ప్రిడేటర్లుగా పిలుస్తూ అవమానించారన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు మధ్య తరగతి అఫ్రికన్‌-అమెరికన్లను తుడిచిపెట్టాలన్న లక్ష్యంతోనే పనిచేశారని ఆరోపణలు చేశారు. వ్యాక్సిన్‌ రావడాన్ని ఆలస్యం చేసి, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి దేశాన్ని షట్‌ డౌన్‌ చేయాలన్నదే బైడెన్‌ ప్రణాళికలా ఉందన్నారు.

"రిపబ్లికన్లకు వేసే ఓటు అమెరికా కలల్ని, అబ్రహాం లింకన్‌ పార్టీ ఆశయాలను సాకారం చేస్తుంది. బైడెన్‌ వస్తే.. పేదరికం, దుఃఖం, నిరాశావాదం వస్తాయి. అదే నేను గెలిస్తే ఉద్యోగాలు సృష్టిస్తాను".

-ట్రంప్.

తన యంత్రాంగం కొద్ది వారాల్లోనే అందరికీ సురక్షితమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తుందని ట్రంప్‌ భరోసా ఇచ్చారు. శుక్రవారం ట్రంప్‌ పాల్గొన్న నాలుగు ర్యాలీల్లోనూ ఇదే తరహాలో బైడెన్‌పై విరుచుకుపడ్డారు. నవంబరు 3న జరిగే ఎన్నికల్లో తనకు తిరుగులేని విజయం అందించాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఫేక్‌ సర్వేలను పట్టించుకోవద్దని, గెలిచేది రిపబ్లికన్‌ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.

దీటుగా స్పందన..

'విభజనకారి ట్రంప్‌ స్వభావం ఏమిటన్నది అందరికీ తెలిసింది. ఇప్పుడు మనమేంటో అతనికి చూపిద్దాం. నేను డెమొక్రాట్‌ అభ్యర్థిగా గెలిచినా.. అమెరికా అధ్యక్షుడిగా అందరివాడిగా పాలిస్తా' అని ట్రంప్‌ విమర్శలకు జో బైడెన్‌ దీటుగా స్పందిస్తున్నారు. అదే స్థాయిలో ప్రత్యర్థిపై ఆరోపణలు చేస్తున్నారు.

జాతి, వర్ణం, జాతీయ గీతం పేరిట అమెరికాను విభజించిన ఘనత ట్రంప్‌దేనని ఎద్దేవా చేశారు. అమెరికన్లను పరస్పరం శత్రువులుగా మార్చారని ధ్వజమెత్తారు. శుక్రవారం మిన్నెసోటా ర్యాలీలో బైడెన్‌ ప్రసంగిస్తూ.. ట్రంప్‌ను మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా అమెరికా భరించలేదన్నారు.

"అమెరికాలో ప్రజల మధ్య విభజనవాదం తీసుకొచ్చి తన పబ్బం గడుపుకోవడమే ట్రంప్‌ నైజం. అధ్యక్షుడిగా తొలినుంచి ఆయన చేస్తున్నదిదే. జాతి, వర్ణం, జాతీయత మూలాల పేరిట అమెరికా పౌరుల మధ్య గొడవలు సృష్టిస్తూనే ఉన్నారు. ఇది క్షమించరాని తప్పు"

-జో బైడెన్.

2008, 2012 ఎన్నికల్లో బరాక్‌ ఒబామాను, తనను నమ్మి అధికారం అప్పగించారని, పదవిలో ఉన్న ప్రతి రోజు మొత్తం జాతి కోసం పనిచేశామన్నారు బైడెన్. 2020లో గెలిపిస్తే అదే స్ఫూర్తితో పనిచేస్తానన్నారు. తన ప్రచారానికి పరిధులు లేవని, డెమొక్రాట్లు, రిపబ్లికన్లు, స్వతంత్రులంతా కలిసి తన ప్రచారంలో పాల్గొంటున్నారన్నారు.

ట్రంప్‌ బృందంలో పనిచేసిన ఆరుగురు జనరల్స్‌ మధ్యలోనే పదవులు వదిలి వెళ్లిపోయారని, అమెరికా కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా ట్రంప్‌ పనికిరాడు.. అన్నదే వాళ్ల అభిప్రాయమని చెప్పారని గుర్తుచేశారు. ఈ పరిస్థితి గతంలో ఏ అధ్యక్షుడికీ ఎదురుకాలేదని ఎద్దేవా చేశారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలిరోజు నుంచి ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ అమెరికన్ల మనశ్శాంతిని పోగొట్టారని, ఇకపై అతని ఆటలు సాగనివ్వమని చెప్పారు. ఓటర్లంతా మేల్కొని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరారు.

ఇదీ చదవండి:హాలోవీన్​ రోజు కత్తిపోట్ల కలకలం.. ఇద్దరు మృతి

ప్రచారంలో ట్రంప్ టాప్ గేర్​- 3రోజుల్లో 14 ర్యాలీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.