ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్​ ప్రయోగం ఆ జంతువుపైనే..!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్​ అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే టీకాను పరీక్షించేందుకు ఓ జంతువును ఎంచుకున్నారు. చూసేందుకు ముంగిసలా ఉన్నా.. వాటి శ్వాసకోశ వ్యవస్థ అచ్చం మనిషిని పోలి ఉండటమే ఇందుకు కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ జంతువు ఎంటో తెలుసా?

australia scientists preparing to vaccine test on ferret animal
కరోనా వ్యాక్సిన్​ ప్రయోగం ఆ జంతువుపైనే..ఎందుకంటే
author img

By

Published : Apr 5, 2020, 6:28 AM IST

కరోనా మహమ్మారికి టీకా (వ్యాక్సిన్‌) అభివృద్ధి దిశగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఇందుకు జరిపే ప్రయోగ పరీక్షలకు అనువైన జంతువుగా ఫెర్రెట్‌(ముంగిస వంటి క్షీరదం)ను గుర్తించారు. దీని శ్వాసకోశ వ్యవస్థ తీరుతెన్నులు అచ్చంగా మానవుల ఊపిరితిత్తులను పోలి ఉంటాయని తేల్చారు. కరోనా వైరస్‌ ఈ జీవికీ సోకుతుందని నిర్ధరించారు. కామన్వెల్త్‌ సైంటిఫిక్‌, ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(సీఎస్‌ఐఆర్‌వో)లో ప్రమాదకరమైన సూక్ష్మజీవులపై పరిశోధన సాగిస్తున్న ఈ శాస్త్రవేత్తల బృందానికి భారత సంతతికి చెందిన వైరాలజీ నిపుణుడు, ప్రొఫెసర్‌ శేషాద్రి వాసన్‌ నేతృత్వం వహిస్తున్నారు.

ఫెర్రెట్లపై పరిశోధనల ద్వారా కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ తీరుతెన్నులపై ఈ బృందం అధ్యయనం జరుపుతోంది. అమెరికా, బ్రిటన్‌, చైనాలో మొదటి దశ క్లినికల్‌ పరీక్షల్లో టీకాల సమర్థతను వీరు పరీక్షిస్తున్నారు. ఇందులో ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఇనోవియో ఫార్మా సంస్థ రూపొందించిన రెండు టీకాలూ ఉన్నాయి. త్వరలోనే వీటిని మానవులపై పరీక్షించనున్నారు. అంతకుముందే ఈ టీకాలను జంతువులపై విజయవంతంగా పరీక్షించి చూడాలి. ఇలా ఏకకాలంలో అనేక టీకాలను జంతువులపై పరీక్షించడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి.

ferret
ఫెర్రెట్​

'ఆక్స్‌ఫర్డ్‌' రూపొందించిన టీకాను కండరాల్లోకి ఎక్కించాలి. అయితే దీన్ని ముక్కు ద్వారా ఇస్తే అదనపు రక్షణ లభిస్తుందా అన్నది వాసన్‌ బృందం పరిశీలిస్తోంది. వైరస్‌లో వచ్చే మార్పుల వల్ల ఆ జీవి వ్యవహారశైలిపై ఎలా ప్రభావం పడుతుందన్నది అర్థం చేసుకోవడం కోసం కొవిడ్‌-19పై ప్రచురితమైన 181 జన్యుక్రమాలను బయోఇన్ఫర్మాటిక్స్‌ నిపుణుల సాయంతో విశ్లేషించింది.

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు నెలకొనడంతో వేగంగా పనిచేస్తున్నాం. సమగ్రంగా పరిశోధనలు సాగిస్తున్నాం. ఇది చాలా సవాళ్లతో కూడుకున్న ప్రక్రియ. మా పరిశోధన కోసం ఇప్పటికే కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో వృద్ధి చేశాం. ఆ సూక్ష్మజీవి జన్యుక్రమాన్ని ధ్రువీకరించాం. ఇప్పుడు టీకాల సామర్థ్యం గురించి సకాలంలో సమాచారాన్ని ఇచ్చేందుకు సంక్లిష్టమైన పరిశోధన చేపట్టాం.

శేషాద్రి వాసన్‌, పరిశోధకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.