ETV Bharat / international

ట్రంప్​ సభకు హాజరైన వ్యక్తికి కరోనా - అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పాంపియో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పాల్గొన్న కాన్ఫరెన్స్​కు హాజరైన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఈ భేటీలో ట్రంప్​తో గానీ, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​తో గానీ ఆ వ్యక్తి ఎటువంటి సంభాషణలు జరపలేదని స్పష్టం చేశారు.

Attendee at political summit featuring Trump has coronavirus
ట్రంప్​ సభకు హాజరైన వ్యక్తికి కరోనా
author img

By

Published : Mar 8, 2020, 10:35 AM IST

ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు అమెరికాకు వణుకుపుట్టించే పరిస్థితికి దారితీస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​​ పాల్గొన్న ఓ కాన్ఫరెన్స్​కు హాజరైన వ్యక్తికి కరోనా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాషింగ్టన్​లో ఫిబ్రవరి 26-29 మధ్య జరిగిన 'కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్​'లో ట్రంప్​, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​తో పాటు పలు కేబినెట్​ మంత్రులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నట్లు శ్వేతసౌధ అధికారులు తెలిపారు.

న్యూ జెర్సిలోని ఓ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్యపరీక్షల్లో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు కాన్ఫరెన్స్​ నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ సమావేశంలో అగ్రరాజ్య అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో ఎటువంటి సంభాషణలు అతను జరపలేదని, అలాగే ముఖ్యమైన భేటీల్లో బాధితుడు పాల్గొనలేదని అధికారులు స్పష్టం చేశారు.

కరోనా సోకిన వ్యక్తితో తాను మాత్రం సంభాషించినట్లు చెప్పారు కాన్ఫరెన్స్ నిర్వహించిన సంస్థ ఛైర్మన్​. తనకెలాంటి ఆందోళన లేదని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ముందుకు సాగేందుకే సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

చైనాలో మరో 27 మంది మృతి...

చైనాలో కరోనా ధాటికి శనివారం 27 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. వీరితో కలిపి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,097కు చేరింది. మరో 47మందికి వైరస్​ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 95 దేశాలకు వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి.. 3500 మందిని బలి తీసుకుంది. లక్ష మందికి పైగా సోకింది.

ఇదీ చూడండి:అడవిని చదివిన 'తులసి' బామ్మకు పద్మశ్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.