ఉత్తర అమెరికా ద్వీపదేశం బహమాస్‌పై డొరైన్ తుపాను విరుచుకుపడుతోంది. గంటకు 297 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు జనజీవనం అస్తవ్యస్తమైంది. తుపాను ప్రభావానికి ఇళ్లు, కార్లు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
1950 నుంచి అట్లాంటిక్ సముద్రంలో వచ్చిన రెండో అతిపెద్ద హరికేన్‌గా డొరైన్ను పేర్కొంటున్నారు అధికారులు. తుపాను ప్రభావం వల్ల ఇప్పటివరకు ఏడుగురు మరణించారని బహమాస్ దేశ ప్రధాని హుబెర్ట్ మిన్నిస్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇదీ చూడండి:పడవలోని ఆ 34 మంది అగ్నికి ఆహుతయ్యారు!