ETV Bharat / international

వ్యాన్​ బోల్తా-10 మంది మృతి

అమెరికాలో వ్యాన్​ బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరిలించిన అధికారులు.. వారంతా వలసదారులుగా భావిస్తున్నారు.

road accident
రోడ్డుప్రమాదం
author img

By

Published : Aug 5, 2021, 9:10 AM IST

అమెరికా టెక్సాస్‌లో ఘోరో ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న వ్యాన్​ బోల్తా పడిన ఘటనలో 10 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ వ్యాన్​లో 29 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్‌సినోలోన మెక్‌అల్లెన్‌కు ఉత్తరాన 80 కిలోమీటర్లు దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

ఆ వాహనంలో సామర్థ్యానికి మించి 29 మందిని ఎక్కించడమే కాకుండా.. అతివేగంగా నడిపి మార్గం మళ్లించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు చెప్పారు. వ్యాన్​కు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.

స్మగ్లింగ్​ చేసేందుకు దేశంలోకి అక్రమ వలసదారులు చొరబతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వారిని వేగంగా నిర్దేశిత ప్రదేశాలకు వేగిరంగా తరలించే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఇదీ చూడండి: సైనిక రవాణాలో చైనా మరో ముందడుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.