బోయింగ్ సంస్థ తొలి వ్యోమగామి కమాండర్ క్రిస్ ఫెర్గూసన్.. అంతరిక్షంలోకి వెళ్లేందుకు నిరాకరించారు. వచ్చే ఏడాది తన కూతురి వివాహం దగ్గరుండి జరిపించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు ఫెర్గూసన్.
గతేడాది డిసెంబర్లో సాంకేతిక లోపాలు తలెత్తినందున బోయింగ్ వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్లకుండా నిలిచిపోయింది. అదే సమయంలో ఆ సంస్థకు ఎంపికైన ఇద్దరు వ్యోమగాముల్లో.. ఆరోగ్య సమస్యలతో నాసా వ్యోమగామి ఎరిక్బోయ్ వైదొలిగారు. కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ.. ఫెర్గూసన్ కూడా ఇప్పుడు తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
-
I’m taking on a new mission, one that keeps my feet planted here firmly on Earth and prioritizes my most important crew – my family. I’ll still be working hard with the #Starliner team and the @NASA_Astronauts on our crew. pic.twitter.com/PgdhPqwYQS
— Christopher Ferguson (@Astro_Ferg) October 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I’m taking on a new mission, one that keeps my feet planted here firmly on Earth and prioritizes my most important crew – my family. I’ll still be working hard with the #Starliner team and the @NASA_Astronauts on our crew. pic.twitter.com/PgdhPqwYQS
— Christopher Ferguson (@Astro_Ferg) October 7, 2020I’m taking on a new mission, one that keeps my feet planted here firmly on Earth and prioritizes my most important crew – my family. I’ll still be working hard with the #Starliner team and the @NASA_Astronauts on our crew. pic.twitter.com/PgdhPqwYQS
— Christopher Ferguson (@Astro_Ferg) October 7, 2020
"ఇది చాలా కఠిన నిర్ణయం. నా కుటుంబానికి వచ్చే ఏడాది అత్యంత కీలకం. అందుకోసమే నేను వైదొలగాల్సి వస్తోంది. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. కానీ.. వచ్చే ఏడాది అంతరిక్షంలోకి వెళ్లడం మానేశానంతే."
- క్రిస్ ఫెర్గూసన్, బోయింగ్ వ్యోమగామి
అయితే.. తాను సంస్థ నియమాలకు కట్టుబడి ఉంటానని, త్వరలోనే మళ్లీ బోయింగ్‌కు సేవలందిస్తానని పేర్కొన్నారు ఫెర్గూసన్.
ఇదీ చదవండి: షార్క్ నుంచి త్రుటిలో తప్పించుకున్న సర్ఫర్!