ETV Bharat / international

ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ మూడోదశ​ ట్రయల్స్​ నిలిపివేత!

ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికా రూపొందించిన కొవిడ్​-19 వ్యాక్సిన్​ క్యాండిడేట్​ మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​కు బ్రేక్​ పడింది. బ్రిటన్​లో టీకా ప్రయోగంచిన ఓ వ్యక్తి అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ట్రయల్స్​ నిలిపివేసినట్లు సంస్థ ప్రకటించింది. ఇలాంటి ప్రక్రియ సహజమేనని.. వ్యాక్సిన్ తయారీ ఆలస్యం కాకుండా కారణం తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపింది.

author img

By

Published : Sep 9, 2020, 8:26 AM IST

Updated : Sep 9, 2020, 8:36 AM IST

AstraZeneca COVID-19 vaccine
ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ మూడోదశ​ ట్రయల్స్​ నిలిపివేత!

కరోనా మహమ్మారి వ్యాక్సిన్​ కోసం యావత్​ ప్రపంచ ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు మూడో దశ ట్రయల్స్​కు చేరుకున్న నేపథ్యంలో టీకాపై ఆశలు రేకెత్తాయి. అయితే.. ఈ ప్రయోగాల్లో ముందంజలో ఉన్న ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనికా రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్యాండిడేట్​​ మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​ నిలిచిపోయాయి. ట్రయల్స్​లో భాగంగా టీకా తీసుకున్న ఓ వ్యక్తికి అనారోగ్య సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ మేరకు ట్రయల్స్​ నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు.

బ్రిటన్​లో చేపట్టిన మూడోదశ ప్రయోగాల్లో ఓ వ్యక్తికి టీకా దుష్ప్రభావాలు కనిపించిన నేపథ్యంలో ట్రయల్స్​ నిలిచిపోయినట్లు తొలుత.. ఎస్​టీఏటీ వార్తా సంస్థ నివేదించింది. అనంతరం అమెరికా సహా ఇతర దేశాల్లో వ్యాక్సిన్​ ట్రయల్స్​ నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనికా సంస్థ ప్రతినిధి ప్రకటించారు.

''వ్యాక్సిన్​ ట్రయల్స్​ నిలిపివేత అన్నది సహజంగా జరిగే ప్రక్రియే. ప్రయోగదశలో ఎవరికైనా తేడా వస్తే ఇలా చేస్తాం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ట్రయల్స్​పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. వ్యాక్సిన్​ తయారీ ఆలస్యం కాకుండా ఉండేలా.. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.''

- ఆస్ట్రాజెనికా

వ్యాక్సిన్​ మూడో దశ ప్రయోగాల కోసం అమెరికాలో 30వేల మందిని నియమించే ప్రక్రియను ఆగస్టులోనే ప్రారంభించింది ఆస్ట్రాజెనికా. అలాగే బ్రిటన్​లోనూ వేల మందిపై ట్రయల్స్​ చేస్తోంది. బ్రెజిల్​, దక్షిణాఫ్రికాలోనూ ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తీవ్రంగా పరిగణించాలి..

ఎలాంటి అనారోగ్యం అనేది చెప్పలేని పరిస్థితులను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి ట్రయల్స్​ నిలిచిపోయేందుకు టీకా దుష్ప్రభావమే కారణం అని తెలియకపోయినా.. త్వరలోనే సమర్థవంతమైన వ్యాక్సిన్​ తయారవుతుందని బ్రౌన్​ వర్సిటీ డాక్టర్​ ఆశిష్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తికి వచ్చిన అనారోగ్యం టీకాకు సంబంధం ఉండకపోయినా.. ప్రజల్లోకి వ్యాక్సిన్​ తీసుకెళ్లే ముందు ట్రయల్స్​ ఎందుకు చేయాలో దాని ప్రాముఖ్యతను తెలిపిందని మరొకరు పేర్కొన్నారు.

ఆందోళనలకు ఊతం..

టీకా సురక్షితమని, సమర్థవంతమైనదని తేలకముందే అనుమతులు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఎఫ్​డీఏపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందనే ఆందోళనను ఈ ప్రకటన మరింత పెంచుతోంది. ఆక్స్​ఫర్డ్​ టీకా ట్రయల్స్​ నిలిపివేతపై ఎఫ్​డీఏ ఇంకా స్పందించలేదు.

ఇదీ చూడండి: 'వ్యాక్సిన్​ సురక్షితమని తేలేవరకు అనుమతే అడగం'

Last Updated : Sep 9, 2020, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.