ఎన్నికల్లో విజయంపై ధీమాతో డెమొక్రటిక్ అభ్యర్థులు జో బైడెన్, కమలా హారిస్.. తమ పరిపాలన వ్యూహాలకు పదును పెట్టారు. కరోనాతో తీవ్ర సంక్షోభంలోకి చేరిన ప్రజారోగ్యం, ఆర్థిక వ్యవస్థ రంగాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి బైడెన్ కీలక ప్రకటన చేశారు.
బాధ్యతలు స్వీకరించిన మరు క్షణం నుంచి కరోనా నియంత్రణకు కృషి చేస్తామని బైడెన్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు బలైనవారిని రక్షించలేకపోయినా.. భవిష్యత్తులో చాలామంది ప్రాణాలు కాపాడుతామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే ప్రజారోగ్యం, ఆర్థిక సంక్షోభం విషయంలో నిపుణుల బృందంతో బైడెన్, హారిస్ చర్చలు నిర్వహించారు. దేశంలో కరోనా నియంత్రణ ఎలా విఫలమైందో చర్చించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'విజయం మాదే.. 300 ఎలక్టోరల్లు గెలుస్తాం'