ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా తగ్గినా... భారత్​లో కరోనా విజృంభణ - ప్రపంచవ్యాప్తంగా తగ్గినా.. భారత్​లో కరోనా విజృంభణ

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతున్న సమయంలో భారత్​, జపాన్​ దేశాల్లో విజృంభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అధిక ప్రభావం ఉన్న అమెరికా, ఐరోపా దేశాల్లో వైరస్​ తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు ఉన్నాయని తెలిపారు.

As outbreaks flatten in places, Japan, India see more cases
భారత్​లో కరోనా విజృంభణ
author img

By

Published : Apr 9, 2020, 3:35 PM IST

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఈ వైరస్​ ప్రభావం అధికంగా ఉంది. అయితే.. ఆయా దేశాల్లో కరోనా ప్రభావం తగ్గి ఆంక్షలను సడలించే సమయానికి భారత్​, జపాన్​లో విజృంభిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జపాన్​లో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని.. భారత్​లోని అధిక జనాభా కలిగిన ప్రాంతాలు వైరస్​ హాట్​స్పాట్లుగా మారతాయని హెచ్చరించారు.

పెరుగుతున్న కేసులు..

జపాన్​లో గురువారం ఒక్కరోజే 500కుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే వృద్ధుల జనాభా అధికంగా ఉన్న ఈ దేశంలో వైరస్​ వేగంగా విస్తరించటం ఆందోళన కలిగించే విషయం. ప్రధాని షింజో అబే గత వారం టోక్యో సహా 6 ప్రధాన నగరాల్లో లాక్​డౌన్​ కాకుండా.. ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారు. అయితే.. ఇప్పటికీ వ్యాపార సంస్థలు, కంపెనీలు ఇంటి నుంచి పనిని నిర్వహించడానికి మొగ్గు చూపటం లేదు. చాలా మంది ప్రయాణికులు యథావిధిగా టోక్యో వీధుల్లో కనిపిస్తున్నారు. ఇదే కొనసాగితే.. వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవటం చాలా కష్టంగా మారనుంది.

భారత్​లోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 5వేలు దాటింది. 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే... కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది. 130 కోట్ల జనాభా వచ్చే వారం వరకు లాక్​డౌన్​లో ఉండనున్నారు. ఇళ్లల్లో ఉన్న వారికి ఆహార పదార్థాలు, ఔషధాలు అందిస్తున్నారు.

మెరుగైన సంకేతాలు..

మరోవైపు.. 30వేల మందికిపైగా మరణించిన ఇటలీ, స్పెయిన్​ వంటి దేశాల్లో మరణాలు, చికిత్స పొందుతున్నవారు, కొత్త కేసులు సమం అవుతున్నాయి. న్యూయార్క్​లోనూ విపత్కర పరిస్థితుల్లో మెరుగైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ సంక్షోభం ఇప్పట్లో ముగియదని రాజకీయ నాయకులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్​ అడ్డుకునే చర్యలను దేశాలు సడలిస్తే.. ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు.

" మేము భౌతిక దూరం పాటించే విషయంలో కఠినంగా ఉన్నందున వైరస్ వ్యాప్తి సూచీని తగ్గించగలుగుతున్నాం. కానీ, ఇది ఆత్మసంతృప్తి చెందాల్సిన సమయం కాదు. ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం మరణిస్తున్నవారిలో చాలా మంది వైరస్​ వ్యాప్తి చెందుతున్న తొలినాళ్లలో అనారోగ్యానికి గురైనవారే. "

- ఆండ్రూ క్యూమో, న్యూయార్క్​ గవర్నర్​.

అంతకు మించిన కేసులు..

జాన్స్​ హాప్​కిన్స్​ విశ్వవిద్యాలయం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 15 లక్షలు దాటాయి. 90వేల మంది వరకు మరణించారు. అయితే.. పరీక్షలకు సరైన సదుపాయాలు లేకపోవటం, మరణాలు, కేసులను లెక్కించే విధానంలో తేడా వల్ల ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.