ETV Bharat / international

కరోనా వేళ స్వాతంత్య్ర వేడుకలకు ట్రంప్ పట్టు - ట్రంపరితనం

కరోనా ధాటికి అమెరికా విలవిల్లాడుతోంటే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జులై 4న స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఆరోగ్య నిపుణుల హెచ్చరికలను ఖాతరు చేస్తూ వాషింగ్టన్​లో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేడుకలపై చాలా మంది వెనక్కుతగ్గుతోన్న కొద్దీ ట్రంప్ మరింత దూకుడు పెంచుతున్నారు.

Trump
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
author img

By

Published : Jul 4, 2020, 2:25 PM IST

అమెరికాలో కరోనా వైరస్ భారీగా పెరుగుతున్న వేళ ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడవద్దని ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాలకు దూరంగా ఉండాలని అర్థిస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రాజధాని వాషింగ్టన్​లో శనివారం సాయంత్రం భారీ వేడుకలకు సిద్ధమయ్యారు.

దేశ సంస్కృతి, సైనిక సంపత్తిని ప్రదర్శిస్తూ భారీ ఎత్తున 'సెల్యూట్ ఫర్ అమెరికా' వేడుకలను నిర్వహిస్తామని శుక్రవారం ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జాతీయ మాల్​ వద్దకు వేలాది మంది చేరుకునే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

రష్​మోర్​లోనూ..

కరోనా వ్యాప్తి కారణంగా చాలా సంఘాలు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ట్రంప్ మాత్రం భారీగా ప్రజలను పోగు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయంలో మరింత దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో మౌంట్ రష్​మోర్​లో జాతినుద్దేశించి ప్రసంగించారు. దక్షిణ డకోటా గవర్నర్ క్రిస్టీ నోయెమ్​ నిర్వహించిన ఈ వేడుకలో భౌతిక దూరం నిబంధనలను గాలికి వదిలేశారు. మాస్కులు ధరించటం తప్పనిసరేమీ కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశంలో 1.29 లక్షల మంది ప్రాణాలు తీసిన మహమ్మారిపై కొద్దిసేపు మాత్రమే ప్రసంగించారు.

ప్రమాదమున్నా మీ ఇష్టమే..

వాషింగ్టన్​లో శనివారం జరిగే వేడుకలపై అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఉత్సవాల వల్ల కరోనా వైరస్ మరింత విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజల సొంత నిర్ణయం మేరకే వేడుకలకు హాజరుకావచ్చని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు జీరోమ్​​ ఆడమ్స్​ అన్నారు.

వాషింగ్టన్​ వేడుకలకు హాజరయ్యే వారికి 3 లక్షల మాస్కులు అందజేస్తామని హోం శాఖ అధికారులు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవటంతోపాటు 6 అడుగుల దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

తెలివిగా ఆలోచించండి..

వేడుకల విషయమై స్పందించిన వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌజర్​.. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే అధికారం తనకు లేదన్నారు. కానీ ఇటువంటి ప్రయత్నాలు ప్రజలకు ప్రమాదకరంగా మారుతాయని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజలు తెలివిగా ఆలోచించాలని సూచించారు. ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానం అందితే కచ్చితంగా వెళ్లాల్సిన అవసరం లేదన్నారామె.

మొదటి నుంచీ..

అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ట్రంప్ మొదటి నుంచి భావిస్తున్నారు. ఆర్థిక కార్యకలాపాలతోపాటు తన ఎన్నికల ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరోగ్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలను ఖాతరు చేస్తూ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి: 'నిరసనల పేరుతో జాతీయ హీరోలను కించపరిచారు​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.