ETV Bharat / international

ట్రంప్ ప్లాన్​- బీ: నల్లజాతీయులకు భారీ హామీలు - అమెరికా అధ్యక్ష ఎన్నికలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. కరోనా సమయంలోనూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అమెరికన్లతో పాటు ఇతర సమాజాల ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అట్లాంటా, జార్జియా రాష్ట్రాల్లోని నల్లజాతీయులు, హిస్సానిక్ ఓటర్ల కోసం ప్రత్యేక హామీలు గుప్పించారు.

Trump
ట్రంప్
author img

By

Published : Sep 26, 2020, 9:01 AM IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. కీలక రాష్ట్రాల్లో సాధారణంగా డెమొక్రాట్లకు మద్దతుగా నిలిచే నల్లజాతీయులు, హిస్సానిక్ ఓటర్లను ఆకర్షించేందుకు తన రెండో ప్రణాళికను సిద్ధం చేశారు.

అట్లాంటా, జార్జియా రాష్ట్రాల్లో జరిగిన ప్రచారాల్లో 'బ్లాక్ వాయిసెస్​ ఫర్ ట్రంప్'​ నినాదాలతో పలు అభివృద్ధి హామీలను గుప్పించారు. రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కోరుతూ.. నల్లజాతీయుల ఆర్థిక వృద్ధికి నగదు రుణాలను అందజేస్తామని స్పష్టం చేశారు.

సెలవు దినం..

అమెరికాలో బానిసత్వానికి విముక్తి లభించిన 'జూన్​టీంత్'​ (జూన్​ 19)ను జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. 1865 జూన్​ 19న టెక్సాస్​, గాల్వస్టన్​లోని బానిసలు స్వాతంత్య్రం పొందిన నేపథ్యంలో ఈ తేదీని 'జూన్​టీంత్'​గా వ్యవహరిస్తారు.

నల్లజాతీయుల హత్యలపై..

అమెరికాలో ఇటీవల జరిగిన నల్లజాతీయుల హత్యలపై ట్రంప్ స్పందించారు. బెరొన్నా టేలర్, జార్జి ఫ్లాయిడ్, అహ్మాద్ ఆర్బెరీ మరణాలపై దేశం విచారిస్తోందన్నారు. ఇలాంటి మూక పాలనకు అనుమతించకూడదని నినదించారు.

ఇదీ చూడండి: ఇక విదేశీ యుద్ధాలకు అమెరికా స్వస్తి: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.