ETV Bharat / international

అమెరికాలో సగం మందికి కరోనా టీకా వద్దట! - Pfizer vaccine

ఓ వైపు ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్​ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటే.. అమెరికా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కేవలం సగభాగం మందే టీకా వేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఓ సర్వేలో తేలింది. టీకా విషయంలో భద్రత కొరవడిందని అ దేశ పౌరులు అనుమానం వ్యక్తం చేయడమే ఇందుకు కారణం.

AP-NORC poll: Only half in US want shots as vaccine nears
అమెరికాలో కరోనా వ్యాక్సిన్​ పంపిణీకి లభించని ఆదరణ
author img

By

Published : Dec 10, 2020, 10:14 AM IST

కరోనా వైరస్​ను అరికట్టేందుకు వ్యాక్సిన్​ సరఫరా దిశగా సన్నద్ధమవుతోంది అమెరికా. ఇందుకోసం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. తమ దేశానికే ప్రాధాన్యతనిచ్చే విధంగా వ్యాక్సిన్​ ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్స్​పై సంతకం చేశారు. అయితే.. ఆ దేశంలో సుమారు 50శాతం మంది మాత్రమే టీకా వేసుకొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు.. అసోసియేటెడ్​ ప్రెస్​-నేషనల్​ ఒపీనియన్​ రీసెర్చ్​ సెంటర్​(ఏపీ-ఎన్​ఓఆర్​సీ) సర్వేలో తేలింది. ఇక పెద్దల్లో పావు వంతు మంది వ్యాక్సిన్​ తీసుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండగా.. మరో పావు వంతు మంది టీకా తీసుకోమని స్పష్టంగా చెబుతున్నట్టు పేర్కొంది. వ్యాక్సిన్​ విషయంలో భద్రతా సమస్యలు ఉంటయనే అనుమానమే ఇందుకు కారణమని సర్వే పేర్కొంది. తొలుత టీకా తీసుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై ఇతరుల నిర్ణయం ఆధారపడినట్టు వెల్లడించింది.

కొవిడ్​-19 విజృంభణతో అగ్రరాజ్యంలో ఇప్పటివరకు సుమరు 2లక్షల 90వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటును తగ్గించేందుకు గానూ.. ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం.. దేశ జనాభాలో సుమారు 70శాతం మందికి వ్యాక్సిన్​ అవసరమని నిపుణులు భావిస్తున్నారు.

ఈ నెల 3 నుంచి 7 తేదీల మధ్య.. 1,117 మందిపై సర్వే నిర్వహించి, వాటి ఫలితాలను విడుదల చేసింది ఏపీ-ఎన్​ఓఆర్​సీ. వారిలో ప్రతి పది మందిలో ముగ్గురు మాత్రమే టీకాకు మొగ్గు చూపగా.. మిగతా ఏడుగురు ఇతర దుష్ప్రభావాల గురించి ఆందోళన చెందుతున్నట్టు తేలింది.

టీకా పంపిణీలో వారికే ప్రాధాన్యం

అగ్రరాజ్యానికి చెందిన రక్షణ ప్రధాన కార్యాలయం పెంటగాన్​.. దేశ, విదేశాల్లోని మొత్తం 16 సైనిక ప్రదేశాలలో కరోనా వ్యాక్సిన్​ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు, అత్యవసర సేవా సిబ్బంది, విశ్రాంత సైనిక ఉద్యుగులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత అణ్వాయుధ సిబ్బంది, సైబర్​ భద్రతా దళాలకు అందిచనున్నారు అధికారులు.

ఇదీ చదవండి: ఫేస్ షీల్డ్​ ఒక్కటే కరోనాను అడ్డుకోలేదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.