ETV Bharat / international

అధ్యక్ష పోరు: అమెరికా ఎన్నికల ఫలితాలు ఆలస్యం- ఎందుకంటే? - యూఎస్​ ఎన్నికల ఫలితాల విశ్లేషణ

సాధారణంగా అమెరికా ఎన్నికల్లో 'ఎలక్షన్​ డే' నాడే అధ్యక్షుడు ఎవరనేది తెలిసిపోతుంది. అయితే ఈసారి గతానికంటే భిన్నంగా నవంబర్​3న జరిగే అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  దానికి గల కారణాలు ఏంటి? ఈ ఎన్నికల్లో కొత్తదనం ఏముంది?

US ELECTION RESULT EXPLAINER
అధ్యక్ష పోరు: అమెరికా ఎన్నికల ఫలితాలు ఆలస్యం- ఎందుకంటే?
author img

By

Published : Nov 2, 2020, 8:23 PM IST

అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్​ 3న 'ఎలక్షన్​ డే'(భారత కాలమానం ప్రకారం). ట్రంప్​- బైడెన్​ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. వాస్తవానికి అధ్యక్ష ఎన్నికలు జరిగిన ప్రతీసారి పోలింగ్​ రోజు అర్ధరాత్రి సమయానికి విజేత ఎవరనేది తెలిసిపోయేది. అయితే.. ఈ సారి అలాంటి అవకాశం లేదు. ఫలితాలు మరింత ఆలస్యమయ్యేలా ఉన్నాయి. ట్రంప్​ కూడా ఈ విషాయాన్ని పదే పదే నొక్కి చెబుతున్నారు. ఫలితాలు ఆలస్యం కావడాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఇదీ చదవండి: అమెరికా తలరాతను తేల్చేవి ఇవే...

గతంలో మాదిరి కాకుండా ఈసారి ఫలితాల విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈ ఎన్నికల్లో కొత్తదనం ఏముంది? తెలుసుకుందాం.

కరోనా విజృంభణ నేపథ్యంలో అమెరికాలో మిలియన్ల మంది అమెరికన్లు మెయిల్ ద్వారా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. మెయిల్ బ్యాలెట్లు లెక్కించడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఎన్నికల సిబ్బంది మెయిల్​ బ్యాలెట్​ను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఏమైనా లోపాలు ఉన్నాయా? లేవా? చూసుకొని.. స్కాన్​ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఓటుకు ఇదంతా చేయాల్సి ఉంటుంది. అందుకే చాలా సమయం పడుతుంది.

కొన్ని రాష్ట్రాలు వారికి ఉన్న వనరులను బట్టి మెయిల్​ ఓట్లను ఎలక్షన్​-డే కు కొన్ని వారాల ముందు నుంచే లెక్కిస్తారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఫలితాలు నిర్ణీత సమయంలోగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: చివరి సర్వేలోనూ బైడెన్ జోరు- ట్రంప్​పై భారీ లీడ్

అయితే.. అనేక రాష్ట్రాల్లో మెయిల్​ బ్యాలెట్లను త్వరగా మదింపు చేసే వ్యవస్థలు లేవు. దీనికి తోడు పోలింగ్​ రోజుకంటే ముందుగా మెయిల్​ ద్వారా వేసిన ఓట్లను లెక్కించడాన్ని నిషేధించారు. దీంతో మెయిల్​ ద్వారా వేసిన ఓట్లను, పోలింగ్​ బూత్​లలో వేసిన ఓట్లను ఒకేసారి లెక్కించాల్సి ఉంటుంది.

ఓట్లు లెక్కించకుండానే విజేతను మీడియా సంస్థలు ప్రకటిస్తాయా?

ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే అసోసియేటెడ్ ప్రెస్‌తో సహా.. ఇతర మీడియా సంస్థలు విజేతను అంచనా వేసే అవకాశం ఉంది. నవంబర్ ​3న ఎక్కువ సంఖ్యలో ఓట్లను లెక్కంచడం సాధ్యం కాదు. సర్వేలు, ఎగ్జిట్​ పోల్స్​ ఆధారంగా విజేతను అంచనా వేయవచ్చు.

'ఎలక్షన్​ డే' రాత్రికి అధ్యక్షుడు ఎవరనేది తెలుసుకునే చివరి అవకాశం ఏమైనా ఉందా?

'ఎలక్షన్​ డే' రాత్రికి అధ్యక్షుడు ఎవరనేది అధికారిక ప్రకటన రాకపోయినా.. తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు నెమ్మదిగా ఉండదు. కొన్ని కీలక రాష్ట్రాలు తమ ఫలితాలను వెంటనే విడుదల చేసే అవకాశం ఉంది. అక్కడ వచ్చే మెజార్టీని ఆధారంగా అంచనా వేసుకోవచ్చు.

ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇలా...

ఈ ఎన్నికల్లో కీలకంగా చెప్పుకొనే ఫ్లొరిడా రాష్ట్రంలో 22 రోజుల ముందు నుంచే మెయిల్​ ఓట్లను లెక్కించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసే రాష్ట్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ఎలక్షన్​ డే అర్ధరాత్రి వరకు.. ఓట్ల లెక్కింపు దాదాపు దగ్గర పడుతుంది.

ఒకవేళ ట్రంప్​ ఫ్లొరిడాలో ఓడిపోతే.. మళ్లీ అధ్యక్షుడు కావడానికి అవసరమైన 270 ఎలక్టార్ల ఓట్లు​ రావడం కష్టం.

అలాగే ఉత్తర కరోలినా, జార్జియా రాష్ట్రాల్లోనూ మెయిల్​ బ్యాలెట్ల లెక్కింపును తొందరగానే ప్రారంభించారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా ట్రంప్​నకు చాలా కీలకమైనవి.

మధ్య ప్రాచ్య రాష్ట్రాలైన అయోవా, ఒహియా రాష్ట్రాలు కూడా ముందస్తు మెయిల్​ బ్యాలెట్ల లెక్కింపునకు అనుమతిచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 2016లో ట్రంప్​ గెలిచారు. అయితే.. ఇక్కడ ఈ సారి ట్రంప్​న​కు​ గట్టి పోటీ ఇస్తున్నారు బైడెన్.

ఇదీ చదవండి: ట్రంప్​ X బైడెన్: కీలక రాష్ట్రాల్లో ఎవరిది పైచేయి?

భిన్నంగా ఓటింగ్​..

ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్​ చాలా భిన్నంగా జరుగుతోంది. ఒక్కో పార్టీ ఒక్కో విధానాన్ని ప్రోత్సహిస్తోంది. రిపబ్లికన్లు బ్యాలెట్​ ఓటుకు జై కొట్టగా.. డెమొక్రాట్లు మెయిల్​ ద్వారా ఓటు వేయాలని కోరుతున్నారు.

అయితే.. ఇక్కడ లెక్కించే విధానం ఆధారంగా ఆధిక్యత లభించే అవకాశం ఉంది. బ్యాలెట్​ ఓట్లను లెక్కించినప్పుడు ట్రంప్​, మెయిల్​ ద్వారా వేసిన ఓట్లను మదించినప్పడు బైడెన్​ ఆధిక్యంలో ఉండనున్నారు.

ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసిన ట్రంప్​

ఫ్లొరిడా, జార్జియా, ఒహియా, కరోలినా రాష్ట్రాల్లో తొలుత మెయిల్​ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. దీంతో డెమొక్రటిక్​ పార్టీ వెనుకంజలో ఉండే అవకాశం ఉంది. అయితే.. అదే రాష్ట్రాల్లో బ్యాలెట్​ ఓట్ల లెక్కింపులో రిపబ్లికన్లు దూసుకుపోయే ఛాన్స్​ ఉంది.

ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికల్లో విజేతను రాత్రి వరకు అంచనా వేయడం కొంచెం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి: అమెరికా ఎన్నికల వేళ చైనాలో హైఅలర్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.