అంతరిక్షానికి మనుషులు ప్రయాణించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెబుతోంది నాసా. ఇందుకోసం స్పేస్ఎక్స్ తయారు చేసిన రాకెట్‌ను మరికొన్ని గంటల్లో ప్రయోగించనుంది. ఫ్లోరిడా కేప్ కెనవెరల్ లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి శనివారం మధ్యాహ్నం 1:19 గంటలకు ఈ రాకెట్‌ను అంతరిక్షంలోని పంపనున్నారు. 'రిప్లే' పేరుగల బొమ్మను ఈ రాకెట్లో ఉంచి వ్యోమగాముల ప్రయాణానికి ఇది సురక్షితమో, కాదో తెలుసుకోనున్నారు.
ఆదివారానికి ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుతుంది. మార్చి 8కి తిరిగి భూమిని చేరుతుంది.
ఈ ఏడాదే అంతరిక్షానికి
అనుకున్న విధంగా స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం విజయవంతమైతే ఈ ఏడాది చివరినాటికి ఇద్దరు వ్యోమగాములను పంపే యోచనలో ఉంది నాసా.
ఎనివిదేళ్ల తర్వాత మరోసారి...
దాదాపు ఎనిమిదేళ్ల క్రితం... 2011 జులై 11న స్పేస్ ఎక్స్ డ్రాగన్ రాకెట్ ప్రయోగం జరిగింది. ఆ తర్వాత మళ్లీ వ్యోమగాములను అంతరిక్షానికి తీసుకెళ్లే రాకెట్‌ను ఇప్పడే ప్రయోగించనున్నారు.