ETV Bharat / international

శుభవార్త: 94.5% ప్రభావవంతంగా మోడెర్నా టీకా!

Moderna
మోడెర్నా
author img

By

Published : Nov 16, 2020, 5:41 PM IST

Updated : Nov 16, 2020, 7:09 PM IST

17:36 November 16

శుభవార్త: 94.5% ప్రభావవంతంగా మోడెర్నా టీకా

కొవిడ్​పై పోరాటంలో భాగంగా అమెరికా సంస్థ మోడెర్నా అభివృద్ధి చేసిన టీకాపై కీలక సమాచారం వెల్లడైంది. ఇటీవలే మూడోదశ ట్రయల్స్​ ప్రారంభించగా.. సంస్థ అధ్యయనంలో భాగంగా 94.5% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది.  

ఈ కీలక ప్రకటనను స్వాగతించిన మోడెర్నా చీఫ్‌ స్టీఫెన్ హోగ్ ఇలాంటి ఫలితాలు భవిష్యత్తుపై భరోసా కలిగిస్తాయన్నారు. మోడెర్నా టీకా మహమ్మారిని నిరోధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి టీకాను అందుబాటులోకి తేవాలని మోడెర్నా భావిస్తోంది.  

తమ టీకా వల్ల ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేవన్న మోడెర్నా... వ్యాక్సిన్ హక్కుల కోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని చూస్తోంది.

రెండో వ్యాక్సిన్​గా..

అమెరికాలో ఇప్పటికే ఫైజర్​ టీకా 92 శాతం సమర్థంగా పనిచేస్తుందని ఇటీవల వెల్లడించగా.. తాజాగా మోడెర్నా కూడా పోటీలో నిలిచింది. ఇంకా టీకాపై అధ్యయనం కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి ఫలితాలు వెలువడడానికి మరింత సమయం పట్టనుంది. 

Last Updated : Nov 16, 2020, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.