ETV Bharat / international

'రష్యా నుంచి 'ఎస్​-400' కొనుగోలు వద్దు'

భారత్​కు ఆధునిక ఆయుధాలు అందించడానికి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకు ప్రతిఫలంగా రష్యా నుంచి ఎస్​-400 దీర్ఘ శ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయవద్దని సూచించింది.

author img

By

Published : Jun 15, 2019, 5:51 AM IST

Updated : Jun 15, 2019, 8:01 AM IST

'రష్యా వద్ద 'ఎస్​-400' కొనుగోలు వద్దు'

అధునాతన పరిజ్ఞానం, ఆయుధాలను అందించడం ద్వారా భారత రక్షణ అవసరాలను తీర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా పేర్కొంది. రష్యా నుంచి ఎస్-400 దీర్ఘశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయకూడదని మెలిక పెట్టింది. ఆ వ్యవస్థను కొంటే భారత్​-అమెరికా మైత్రి పరిమితంగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

రష్యా నుంచి 'ఎస్​-400' వ్యవస్థను కొనుగోలు చేస్తే భారత్​-అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం తప్పదని ట్రంప్​ సర్కార్​లోని ఓ సీనియర్​ అధికారి హెచ్చరించారు.

రష్యా నుంచి కొనుగోలు చేయవద్దు..

వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న సదరు క్షిపణి రక్షణ వ్యవస్థ అత్యంత అధునాతనమైనది. ఈ క్షిపణి కొనుగోలుకు గతేడాది భారత్​- రష్యా మధ్య 500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. తాజాగా అమెరికా విదేశాంగశాఖ ఉన్నతాధికారి ఆలిస్​ జీ వెల్స్​ ఈ అంశమై కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల ఉపకమిటీకి వివరణ ఇచ్చారు. భారత్​తోనే అమెరికా ఎక్కువగా సైనిక విన్యాసాలను నిర్వహిస్తోందని తెలిపారు.

"ట్రంప్​ ప్రభుత్వ హయాంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. భారత రక్షణ అవసరాలను తీర్చే విషయంలో సాయం అందిస్తాం. ఇప్పటికే ఆ దేశానికి ఇచ్చిన 'ప్రధాన రక్షణ భాగస్వామి' హోదా ఆధారంగా మైత్రిని మరింతగా ముందుకు తీసుకెళుతున్నాం. పదేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు అనేక రకాల ఆయుధాలను భారత్​కు ఇస్తున్నాం. మరింత పెంచే దిశగా ఆ దేశంతో మాట్లాడుతున్నాం. అయితే రష్యా నుంచి ఎస్​-400 వ్యవస్థ కొనుగోలు వల్ల భారత్​-అమెరికా బంధం మధ్య సమన్వయం కుంటుపడుతుంది." - ఆలిస్​ జీ వెల్స్​, అమెరికా విదేశాంగశాఖ ఉన్నతాధికారి.

విభిన్న దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే ప్రక్రియను భారత్​ మొదలుపెట్టిందని ఆలిస్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆ దేశ ఆయుధాల్లో 65 నుంచి 70 శాతం రష్యా నుంచి వచ్చినవే అని ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి: ప్రత్యేక హోదా కోసం నితీశ్, జగన్ పార్టీలతో బీజేడీ కూటమి!

New Delhi, Jun 14 (ANI): Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy met Home Minister Amit Shah on Friday. After the meeting, he told mediapersons, "The agenda of my visit was tomorrow's NITI Aayog meeting. Tomorrow, we'll be presenting our case to the NITI Aayog, which is chaired by the Prime Minister. I took an appointment with Home Minister today evening to try and prevail on him, to also soften PM's heart on special category status. What we'll definitely be asking for in tomorrow's NITI Aayog meeting. When asked about reports on Lok Sabha Deputy Speaker post, he added, "1st of all there is nothing offered. We haven't asked, neither any proposal of that sort have come from any quarter. So please don't speculate these kind of things."
Last Updated : Jun 15, 2019, 8:01 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.