ఒక సంవత్సరం పాటు తమ ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను అమెరికన్ పోలీసులు వినియోగించకుండా నిషేధించింది అమెజాన్. అయితే ఈ నిర్ణయానికి గల కారణాలను ఈ-కామర్స్ దిగ్గజం వెల్లడించలేదు.
అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు ఈ సాంకేతికతను వాడతారు. అయితే దీనిని దుర్వినియోగం చేసే అవకాశముందని నిపుణులు చాలా కాలం నుంచి హెచ్చరిస్తున్నారు. తాజాగా ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఉదంతంతో ఈ సాంకేతికత ఉపయోగం మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ముఖకవళికల గుర్తింపునకు... వ్యవస్థలో పటిష్ఠ నిబంధనలు తీసుకురావాలని కాంగ్రెస్‌ను కోరింది అమెజాన్.
అయితే అమెజాన్ నిర్ణయం ముఖ్యమైనదే అయినప్పటికీ.. దీనితో అమెరికా పోలీసు వ్యవస్థలో పెద్ద మార్పులు రావని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు క్లార్ గార్వీ తెలిపారు. ఈ సాంకేతికతను రెండు సంస్థలే వినియోగిస్తున్నట్టు తన పరిశోధనలో తేలిందని వివరించారు.
ఇదీ చూడండి:- కీలక డిమాండ్‌తో సత్య నాదెళ్లకు ఉద్యోగుల లేఖ