అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం రోజున అలబామాలో ఓ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తమపై నిందితుడు కాల్పులకు పాల్పడడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
బర్మిగ్హామ్కు పోలీసు శాఖ దక్షిణ విభాగం పరిధిలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఘటన జరిగిందని అధికారి రాడ్ ములాదిన్ తెలిపారు. పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకోగానే.. నిందితుడు దూరంగా పరిగెడుతూ కాల్పులకు తెగబడ్డాడని వివరించారు. ఓ గోడపైకి ఎక్కి పైకి మళ్లీ కాల్పులకు యత్నించాడని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు ఎదురుకాల్పులుకు దిగారని పేర్కొన్నారు.
అనంతరం నిందితుడని ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో అధికారులు ఎవరూ గాయపడలేదు. కాగా.. ద స్టేట్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఈ ఎన్కౌంటర్పై దర్యాప్తు చేపట్టింది.