ETV Bharat / international

'కొవిడ్​ పరీక్షల్లో అమెరికా తర్వాత భారతే బెస్ట్' - covid 19 tests in india

ప్రపంచంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షల నిర్వహణలో అమెరికా ముందంజలో ఉందని, తరువాతి స్థానంలో భారత్ నిలిచిందని శ్వేతసౌధం పేర్కొంది. అమెరికాలో 42 మిలియన్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించగా... భారత్​లో 12 మిలియన్ల కరోనా పరీక్షలు చేశారని వెల్లడించింది. ఒబామా ప్రభుత్వం కంటే ట్రంప్ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ రంగంపై బాగా కృషి చేస్తోందని తెలిపింది.

After US, India has done most COVID-19 tests: White House
'కొవిడ్​ నిర్ధరణ పరీక్షల్లో అమెరికా తర్వాత భారతే బెస్ట్'
author img

By

Published : Jul 17, 2020, 11:10 AM IST

అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించిన దేశంగా భారత్​ నిలిచిందని శ్వేతసౌధం పేర్కొంది. అమెరికా రికార్డు స్థాయిలో 42 మిలియన్ల కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... భారత్​ 12 మిలియన్ల కరోనా టెస్టులు చేసిందని వెల్లడించింది.

"అమెరికా 42 మిలియన్లకు పైగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేసింది. మా తరువాత 12 మిలియన్ల కొవిడ్ టెస్టులు నిర్వహించిన భారత్​ రెండో స్థానంలో ఉంది. కరోనా పరీక్షల్లో మేము ముందుండి ప్రపంచాన్ని నడిపిస్తున్నాము."

- కైలీ మెక్​నానీ, వైట్​హౌస్​ ప్రెస్ సెక్రటరీ

ప్రపంచవ్యాప్తంగా కోటీ 39 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా.... 5 లక్షల 92 వేల మందికిపైగా మరణించారు. అమెరికాలో అయితే 36 లక్షల 95 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వీరిలో లక్షా 41 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు.

ఒబామా కంటే ట్రంపే బెస్ట్

ఒబామా పాలనలో కంటే ట్రంప్ హయాంలోనే ఆరోగ్య (కరోనా) పరీక్షలు బాగా చేస్తున్నట్లు కైలీ మెక్​నానీ పేర్కొన్నారు.

"2009లో ఒబామా-బైడెన్ హయాంలో... సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్​... 'హెచ్​1ఎన్​1 ఫ్లూ' పరీక్షలు ఆపమని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. అలాగే వ్యక్తిగత కేసులను లెక్కించడం మానివేయాలని సూచించింది.

అప్పటి వైస్ ప్రెసిడెంట్ బైడెన్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాప్ రాన్ క్లైన్ ఆ సమయంలో మాట్లాడుతూ, ఈ హెచ్​1ఎన్​1 వైరస్ సంక్షోభం అమెరికా చరిత్రలో ఓ సాధారణమైన ఘటన. దీనికి ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని చెప్పారు. ఇదీ గత ప్రభుత్వం తీరు."

ప్రస్తుతం 13 కరోనా వ్యాక్సిన్​లలో మూడు విజయవంతంగా మానవ క్లినికల్ ట్రయల్స్​ నిర్వహణకు సిద్ధంగా ఉన్నాయని కైలీ మెక్​నానీ తెలిపారు. మరోవైపు కరోనా టెస్టులు ఇంకా నిర్వహిస్తూనే ఉన్నామని, ఇది ట్రంప్ ప్రభుత్వం దృఢసంకల్పానికి నిదర్శనమని కైలీ తెలిపారు.

ఇదీ చూడండి: దేశంలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.