అఫ్గానిస్థాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించారు తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్.
"తాను ఎలాంటి దేశంతో వ్యవహరిస్తున్నారో ట్రంప్ గ్రహించాలి. రాజ్యాలు భూస్థాపితమైన దేశం గురించి ట్రంప్ సలహాదారులు ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి. "
-ముజాహిద్ ట్వీట్, తాలిబన్ ప్రతినిధి
శాంతి చర్చలు విఫలమైన తర్వాత తాలిబన్లు, ట్రంప్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 9/11 దాడుల వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.."మన శత్రువులను గతంలో ఎన్నడూ లేని రీతిలో మన బలగాలు దెబ్బతీశాయి. ఇది ఇలానే కొనసాగుతుంది" అని వ్యాఖ్యానించారు. అనంతరం ఈ వ్యాఖ్యలపై తాలిబన్ పైవిధంగా స్పందించింది.
ఇదీ చూడండి: వాణిజ్య యుద్ధం: అర్థవంతమైన పురోగతే లక్ష్యం..!