ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో(United Nations General Assembly) భాగంగా నిర్వహించనున్న సాధారణ చర్చలో అఫ్గానిస్థాన్, మయన్మార్(United Nations Myanmar) దేశాలు ప్రసంగించబోవని ఐక్యరాజ్యసమితికి చెందిన అత్యున్నత అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు సమావేశాల చివరిరోజైన సోమవారం(అమెరికా కాలమానం ప్రకారం) జరగనున్న అత్యున్నత స్థాయి చర్చల్లో ప్రసంగించే దేశాల జాబితా విడుదలైంది. దీనిలో అఫ్గాన్(Afghanistan United Nations), మయన్మార్ దేశాల పేర్లను చేర్చలేదు ఐరాస.
ఈ జాబితాలో అఫ్గాన్ ప్రతినిధిగా హెచ్‌ఈ గులాం ఎం.ఇసాక్జాయ్ ఉన్నప్పటికీ ప్రసంగించే అవకాశం లేదు. ఇక తిరుగుబాటు ద్వారా మయన్మార్ ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న సైనిక పాలకులు మయన్మార్ తరఫున ఐరాస ప్రతినిధి(Myanmar United Nations Ambassador) క్యో మో టన్ను తొలగించారు. అయన స్థానంలో ఆంగ్ తురీన్ను ఉంచాలని కోరుతున్నారు.
గతవారం అఫ్గానిస్థాన్ రాయబారిగా సుహైల్ షహీన్‌ను ప్రతిపాదించిన తాలిబన్లు.. సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ను కోరారు.
ఇవీ చదవండి: