ETV Bharat / international

కరోనాను మట్టుబెట్టే ఆయుధాలకు సృష్టికర్తలు వీరే.. - why trum called modi for hydraxy chloroqine?

కరోనాతో ప్రపంచం చేస్తున్న యుద్ధంలో గెలవడానికి మానవుడి చేతిలో ఉన్న రెండు ఆయుధాలు 'హ్యండ్​ శానిటైజర్'​, 'హైడ్రాక్సీ క్లోరోక్విన్‌' మాత్రలు. మరి ఆ అద్భుత అస్త్రాలను కనుగొన్నవారెవరు? ఎందుకు తయారు చేశారు? తెలుసుకుందాం రండి.

about-founder-of-hydraxy-chloroqine-acharya-prafulla-chandra-ray-and-about-founder-of-sanitizer-ignaz-semmelweis
కరోనాపై పోరులో ఆ ఆయుధాలు తయారు చేసింది వీరే..
author img

By

Published : Apr 13, 2020, 10:26 AM IST

'హైడ్రాక్సీ క్లోరోక్విన్‌' మాత్రలను మానవాళికి అందించిన మహానుభవలు ఆచార్య 'ప్రఫుల్‌చంద్ర రే'. ఇక హ్యాండ్​ శానిటైజర్లను అందించిన పితామహుడు 'సెమ్మెల్‌వీస్‌'.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వెలుగు రేఖ!

మలేరియాను మట్టుబెట్టే విశేష ఔషధంగా గుర్తింపు పొందిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు... ప్రస్తుతం కరోనాకు కళ్లెం వేసేందుకూ ఉపయోగపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా మన ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి.. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు పంపాలని కోరారంటే వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. భారతదేశానికి ఈ ఘనత దక్కుతోందంటే దీని వెనుక ఓ మహానుభావుడు ఉన్నారు. ఆయనే భారత రసాయన శాస్త్ర పితామహుడు ఆచార్య ప్రఫుల్‌చంద్ర. ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు మనం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను పంపించే సామర్థ్యం సాధించామంటే అప్పట్లో 'ప్రఫుల్‌ చంద్ర రే' సాగించిన అపూర్వ కృషే కారణం.

about-founder-of-hydraxy-chloroqine-acharya-prafulla-chandra-ray-and-about-founder-of-sanitizer-ignaz-semmelweis
హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వెలుగు రేఖ!

ఎవరీ రే?

1861 ఆగస్టు 2న అప్పటి బంగాల్‌ ప్రెసిడెన్సీలోని రరూలీ-కటిపార గ్రామం (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)లో జన్మించారు ప్రఫుల్‌ చంద్ర రే. ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత ఎడిన్‌బరో యూనివర్సిటీ నుంచి 1887లో డీఎస్‌సీ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ప్రెసిడెన్సీ కళాశాలలో 1892 వరకూ రసాయన శాస్త్రాన్ని బోధించారు. రూ.700 మూలధనంతో 'బెంగాల్‌ కెమికల్‌ వర్క్స్‌' సంస్థను ప్రారంభించారు. ప్రజోపయోగ ఔషధాలెన్నింటినో ఉత్పత్తి చేశారు. 1901లో రూ.2 లక్షల పెట్టుబడితో బెంగాల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థ నుంచి మలేరియాను నివారించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు పెద్దఎత్తున ఉత్పత్తి అయ్యేవి. కొంతకాలం కిందట వీటి ఉత్పత్తిని నిలిపేశారు. సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా వేతనం తీసుకోకుండా రసాయనశాస్త్రంలో తనకున్న అపార అనుభవాన్ని రంగరించి.. ప్రజలను అనారోగ్య ఇక్కట్ల నుంచి బయట పడేసే ఔషధాలను ఉత్పత్తి చేశారు ప్రఫుల్‌చంద్ర రే. 'హిందూ రసాయన శాస్త్ర చరిత్ర' అనే గొప్ప గ్రంథాన్ని రాశారీయన. ఈయన కలం నుంచి వెలువడిన వ్యాసాలు అనేక జర్నళ్లలో ప్రచురితమై గుర్తింపును తెచ్చాయి. 1944 జూన్‌ 16న ఆయన మరణించారు.

శానిటైజర్‌ పితామహుడు

కరోనా భయంతో ఇప్పుడు ప్రపంచమంతా సబ్బులు, శానిటైజర్లతో చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నారు. అయితే సూక్ష్మక్రిములను చంపడానికి శానిటైజర్‌ వాడాలని మొదట చెప్పింది ఎవరో తెలుసా? ఆస్ట్రియాలోని వియన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన(1946లో) ఇగ్నజ్‌ ఫిలిప్‌ సెమ్మెల్‌వీస్‌ అనే డాక్టర్‌!

వియన్నా ఆసుపత్రిలో రెండు ప్రసూతి వార్డులుండేవి. ఒక దాంట్లో పురుష వైద్యులు, వైద్య విద్యార్థులు, మరో వార్డులో నర్సులు, ఆయాలు సేవలు అందించేవారు. ఆసుపత్రిలో ప్రసూతి సమయంలో చాలామంది గర్భిణులు మరణించేవారు. వారిని రక్షించాలనే పట్టుదలతో సంబంధిత కారణాలపై డాక్టర్‌ ఇగ్నజ్‌ అన్వేషించారు. పురుష వైద్యులున్న వార్డులో మరణాల సంఖ్య ఎక్కువగా, నర్సులున్న వార్డులో తక్కువగా ఉండటాన్ని గమనించారు. దీనిపై మరింత లోతుగా పరిశోధించగా మరో భయంకరమైన విషయం వెల్లడైంది.

పురుష వైద్యులు ఆసుపత్రిని ఆనుకునే ఉండే శవాగారంలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసేవారు. అప్పుడు వారి చేతులకు రక్తపు మరకలు, ఇతర సూక్ష్మజీవులు అంటుకునేవి. వైద్యులు నేరుగా ప్రసూతి వార్డులోకి వచ్చి పురుడు పోస్తుండటం వల్ల సూక్ష్మజీవుల కారణంగా గర్భిణులకు ఇన్‌ఫెక్షన్‌ అయ్యేది. ఫలితంగా మృతి చెందేవారు. మరో వార్డులోని నర్సులు పోస్టుమార్టం, ఆపరేషన్లు లాంటివి చేయరు. దాంతో అక్కడ గర్భిణులకు ఇన్‌ఫెక్షన్‌ బెడద తప్పి, మరణాల సంఖ్య చాలా స్వల్పంగా ఉండేది. విషయాన్ని నిర్ధారించుకున్న ఇగ్నజ్‌ ఆసుపత్రుల్లో పరిశుభ్రతకు నాంది పలికారు.

ఆపరేషన్‌ చేసేముందు వైద్యులు చేతులను క్లోరిన్‌ ద్రావణంతో శుభ్రంగా కడగాలని నిబంధన పెట్టారు. ఇది పక్కాగా అమలయ్యేలా చూడటం వల్ల ఆసుపత్రిలో మరణాలు క్రమంగా తగ్గుతూ.. రెండేళ్లలో పూర్తిగా కనుమరుగయ్యాయి. ఆయన చేసిన కృషి కాలకమ్రంలో ప్రజలకు చేరింది. శానిటైజర్ల వాడకం పెరిగింది.

ఇదీ చదవండి:లాక్​డౌన్ ఆంక్షల సడలింపు దిశగా కేంద్రం అడుగులు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.