దక్షిణ కాలిఫోర్నియా పోలీసులు కొత్తగా తమ విభాగంలోకి ఓ రోబో పోలీసును ప్రవేశపెట్టారు. 'హెచ్‌పీ రోబో కాప్' అని పిలుచుకుంటున్న ఈ రోబో పోలీసు... ఉద్యానవనాలు, భవన సముదాయాల వద్ద కాపలా విధులు నిర్వహిస్తుంది.
నీలం-తెలుపు రంగుల్లో ఉండే ఈ రోబో పోలీసు... 360 డిగ్రీల్లో చాలా స్పష్టమైన వీడియోలను చిత్రీకరిస్తుంది. పోలీసులు నిత్యం పహారా కాయలేని ప్రదేశాల్లో ఇది తన సేవలను అందిస్తుంది.
మంగళవారం సాయంత్రం నిర్వహించిన వేడుకలో... ఈ రోబో అధికారికంగా దక్షిణ కాలిఫోర్నియా పోలీసు విభాగంలో చేరింది. దీనికి సొంతంగా ఓ ట్విట్టర్ పేజీ కూడా ఉంది.
లాస్ ఏంజెల్స్‌లో గత నెల నిర్వహించిన 5కె రన్ సందర్భంగా ఈ రోబోట్ మొదటిసారిగా వినియోగించారు. అప్పటి నుంచి అది తన సేవలను అందిస్తూనే ఉంది.
ఇదీ చూడండి: రాహుల్ కోసం మోదీ 'హ్యాపీ బర్త్‌డే ట్వీట్'