ETV Bharat / international

కొవిడ్‌ చికిత్స కోసం కొత్త ఔషధం - మానసిన రుగ్మత ఔషధంతో కరోనాకు చెక్​

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నయం చేసే ఓ ఔషదాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వినికిడి సమస్య, మానసిక రుగ్మతలకు ఉపయోగించే వ్యాక్సిన్​.. కొవిడ్​ను అడ్డుకోగలదని తేల్చిచేప్పారు.

A NEW DRUG FOR THE TREATMENT OF COVID
కొవిడ్‌ చికిత్స కోసం కొత్త ఔషధం
author img

By

Published : Aug 16, 2020, 11:29 AM IST

వినికిడి సమస్య, మానసిక రుగ్మతలు సహా అనేక వ్యాధులను నయం చేయడానికి వాడుతున్న ఒక ఔషధం.. కొవిడ్‌-19 చికిత్సకు ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. అధునాతన కంప్యూటర్‌ సిమ్యులేషన్లను ఉపయోగించి, దీన్ని గుర్తించారు.

చికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కరోనా వైరస్‌ జీవిత చక్రంలో కీలక పాత్ర పోషించే ఎంపీఆర్‌వో అనే ఎంజైమ్‌ను వీరు విశ్లేషించారు. తన జన్యు పదార్థమైన ఆర్‌ఎన్‌ఏ నుంచి ప్రొటీన్లను తయారుచేసుకునేలా వైరస్‌కు ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా మానవ కణంలో వైరస్‌ సంఖ్య భారీగా పెరిగేలా చూస్తుంది. వైరస్‌లోని ఈ అంశాన్ని లక్ష్యంగా చేసుకొనే ఔషధాలను గుర్తించాలని శాస్త్రవేత్తలు తలపోశారు. ఇందుకోసం కంప్యూటర్‌ సిమ్యులేషన్లను ఉపయోగించారు. ఎబ్‌సెలెన్‌ అనే ఔషధం.. ఎంపీఆర్‌వోను లక్ష్యంగా చేసుకోగలదని తేల్చారు. ఈ మందులో యాంటీ వైరల్‌ లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇన్‌ఫ్లమేషన్‌, ఆక్సిడేషన్‌ను నిలువరించగలదు.

ఇదీ చూడండి: సంతానలేమికి మగవారూ కారకులే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.