అమెరికాలోని కొలరాడోను మంచు తుపాను వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా మంచు కురుస్తోంది. ఫలితంగా రోడ్లపై మంచు దుప్పటి పరుచుకుంది. డెన్వర్ నగరంలో 3 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది.
హిమపాతంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. గురువారం ఒక్కరోజే 100కు పైగా స్వల్ప ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. వాహన చోదకులను జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో మళ్లీ పోస్ట్‌పెయిడ్ మొబైళ్ల ట్రింగ్ట్రింగ్