అమెరికా అట్లాంటాలోని మోర్హోస్ కళాశాలలో స్నాతకోత్సవ కార్యక్రమానికి ప్రారంభ వ్యాఖ్యాతగా హాజరయ్యారు బిలియనీర్ రాబర్ట్ ఎఫ్ స్మిత్. ప్రసంగించేందుకు వేదికపైకి వెళ్లాక విద్యార్థులందరినీ ఒకరినొకరు ఆలింగనం చేసుకోమన్నారు. కాసేపయ్యాక వాళ్లందరికీ అద్భుత కానుక ప్రకటించి అక్కడున్న వారందరినీ ఒక్క క్షణం పాటు ఆశ్చర్యానికి గురిచేశారు.
పట్టభద్రులవుతున్న విద్యార్థులు తీసుకున్న రూ.280కోట్ల మొత్తం రుణాలను తాను తీరుస్తానని చెప్పారు రాబర్ట్. అమెరికాలో వ్యాపారం ద్వారా ఎంతో సంపాదించిన తన కుటుంబం తరఫున విద్యార్థులకు ఈ బహుమతి ఇస్తున్నట్లు చెప్పారు. కళాశాలకు ఇదే అతిపెద్ద బహుమానమని యాజమాన్యం తెలిపింది. స్మిత్ ఇదివరకే 1.5 మిలియన్ డాలర్లను కళాశాలకు విరాళంగా ఇచ్చారని వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు స్మిత్. భవిష్యత్తు పట్టభద్రుల రుణాలను ప్రస్తుత విద్యార్థులు తీర్చి ఈ పద్ధతిని కొనసాగించాలని సూచించి..అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఇదీ చూడండి: ఎగ్జిట్‌పోల్స్‌లో కచ్చితత్వం ఎంత? గతంలో ఏం జరిగింది?