ETV Bharat / international

మాల్​లో కాల్పుల కలకలం.. 8 ఏళ్ల బాలుడు మృతి - Alabama mall terror attack

వాషింగ్టన్​లోని ఓ షాపింగ్​మాల్​లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

8-year-old killed, 3 injured in shooting at Alabama mall
షాపింగ్​మాల్​లో కాల్పుల కలకలం.. 8 ఏళ్ల బాలుడు మృతి!
author img

By

Published : Jul 4, 2020, 10:18 AM IST

అమెరికా వాషింగ్టన్​లో దారుణం జరిగింది. హూవర్​లోని ప్రముఖ అలబామా షాపింగ్​ మాల్​లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నిత్యం రద్దీగా ఉండే అలబామా షాపింగ్​మాల్​లో కాల్పులు కలకలం రేపాయి. మాల్​లోని ఓ ఫుడ్​ కోర్ట్​ వద్ద దుండగులు తుపాకీలతో కాల్పులకు తెగబడ్డారు. దాదాపు అన్ని వైపుల నుంచి 6-7 తూటాల శబ్ధాలు వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.

స్థానిక మేయర్​ ఫ్రాంక్​ బ్రోకాటో ఘటనలో మృతి చెందిన, గాయపడిన బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

అయితే కాల్పులు జరిపింది ఎవరు, ఎందుకు ఇంతటి ఘాతుకానికి తెగబడ్డారో తెలియాల్సి ఉంది. 2018లో ఇదే అలబామా షాపింగ్​ మాల్​లో.. పోలీసుల కాల్పుల్లో ఓ నల్లజాతీయుడు మృతి చెందాడు. ఇప్పుడు మళ్లీ అదే మాల్​లో కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చదవండి: మహిళపై చేయిజేసుకున్న పోలీస్ సస్పెండ్​!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.