ETV Bharat / international

ఐరాస@75- బహుళపక్ష వేదికగా బహుదూరం

ఐరాస కొన్ని గణనీయ విజయాలు సాధించినా, కొవిడ్‌ను ఎదుర్కోవడానికి సమైక్య వేదికగా నిలవడంలో విఫలమైంది. ఐరాస అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ సమైక్య పోరులో ఐక్యరాజ్యసమితి పత్తా ఎక్కడ? సమితి సమర్థ స్పందన ఏది?’ అంటూ నిలదీశారు. ఐక్యరాజ్య సమితిలో వ్యవస్థాపరమైన లోటుపాట్లు ఉండటం మరో పెద్ద సమస్య.

75-years-to-the-united-nations
ఐక్యరాజ్య సమితికి 75 ఏళ్లు
author img

By

Published : Oct 23, 2020, 10:05 AM IST

ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంస్థాపన పత్రం 1945 అక్టోబరు 24న సభ్యదేశాల ఆమోదం పొందినప్పటి నుంచి ఏటా అదే తేదీని ఐరాస దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఈ 2020వ సంవత్సరం సమితికి 75వ వార్షికోత్సవ సంవత్సరం కూడా. ఏడున్నర దశాబ్దాల నుంచి అనేక ఆటుపోట్లను తట్టుకుని తన బహుళపక్ష స్వభావాన్ని నిలబెట్టుకున్నందుకు ఐరాసను అభినందించాలి. ‘సమితి’ మన ప్రపంచానికి మొట్టమొదటి అంతర్‌ ప్రభుత్వ సంస్థ కాదు కానీ, తాజా పరిణామాలను బట్టి చూస్తే అదే చిట్టచివరిది కావచ్చు. అంతకుముందు నానాజాతి సమితి బహుళపక్ష వేదికగా ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక 1920లో నెలకొన్న నానాజాతి సమితి పునాదులు ఆరంభం నుంచి బలహీనంగా ఉన్నందున అది రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించలేక యుద్ధానంతరం కాలగర్భంలో కలసిపోయింది.

'అనుబంధ' విజయం

నానా జాతి సమితితో పోలిస్తే ఐక్యరాజ్యసమితి చాలా మెరుగని చెప్పాలి. తన విధులను వేర్వేరు అనుబంధ సంస్థలకు అప్పగించడం ద్వారా ఐరాస విజయవంతంగా కార్యనిర్వహణ సాగించగలుగుతోంది. ఐరాస సర్వసభ్య సభ (జనరల్‌ అసెంబ్లీ), భద్రతా మండలి, ఐరాస బాలల నిధి (యునిసెఫ్‌), ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో, అంతర్జాతీయ న్యాయస్థానం, శాంతి రక్షక దళాల రూపంలో సమితి తన విధినిర్వహణను ఉపాంగాలకు పంచి- గణనీయ పురోగతి సాధించింది. ముఖ్యంగా ఐరాసకు ఆరంభంలో నాయకత్వం వహించినవారి దూరదృష్టి, ఆచరణీయ దృక్పథం సంస్థ దీర్ఘకాలం మనుగడ సాగించడానికి తోడ్పడ్డాయి. ‘ఐరాసను సృష్టించినది మానవాళిని స్వర్గానికి తీసుకెళ్లడానికి కాదు. నరకంలో పడకుండా కాపాడటానికి‘ అని ఐరాస ద్వితీయ ప్రధాన కార్యదర్శి డ్యాగ్‌ హ్యామర్‌ షోల్డ్‌ అన్న మాటలను ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఐరాస కొన్ని గణనీయ విజయాలు సాధించినా, కొవిడ్‌ను ఎదుర్కోవడానికి సమైక్య వేదికగా నిలవడంలో విఫలమైంది. ఐరాస అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. చివరకు అక్టోబరు 5న ప్రపంచ జనాభాలో పదో వంతు ప్రజలకు కరోనా వైరస్‌ సోకి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ అవకతవక వైఖరిని చూసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- ‘గడచిన ఎనిమిది, తొమ్మిది నెలల నుంచి ప్రపంచం కరోనా వైరస్‌తో పోరాడుతోంది. ఈ సమైక్య పోరులో ఐక్యరాజ్యసమితి పత్తా ఎక్కడ? సమితి సమర్థ స్పందన ఏది?’ అంటూ నిలదీశారు. ఐక్యరాజ్య సమితిలో వ్యవస్థాపరమైన లోటుపాట్లు ఉండటం మరో పెద్ద సమస్య.

సమితి సర్వ సభ్య సభ (జనరల్‌ అసెంబ్లీ)లో 193 దేశాలు సభ్యులు కాగా, సమితి ఎలా నడవాలో నిర్ణయించేది మాత్రం భద్రతా మండలే. ఈ మండలిలోని ప్రధాన దేశాలు చీటికిమాటికి జోక్యం చేసుకుంటున్నందున జనరల్‌ అసెంబ్లీ కాలానుగుణమైన సంస్కరణలను, పారదర్శకతను తీసుకురాలేకపోతోందని విమర్శలు ఎదుర్కొంటోంది. ఉదాహరణకు సమితి 75వ వార్షికోత్సవ ప్రకటన ముసాయిదాలో ‘ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలన్న ఉమ్మడి లక్ష్యాన్ని సాధించాలి’ అనే పదాలు ఉన్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ విధానంలోనూ దాదాపు ఇవే పదాలు కనిపిస్తాయి. భారత్‌, అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు తీవ్రంగా అభ్యంతరపెట్టిన మీదట సమితి ప్రకటన ముసాయిదాలో ఈ పదాలను మార్చారు. ఐక్యరాజ్య సమితిలో సైనిక చర్యను ఆదేశించడం, ఆంక్షలు విధించడం, శాంతి రక్షక సేనలను నియోగించడం వంటి కీలక బాధ్యతలను నిర్వహించేది భద్రతా మండలే. ఇందులో అమెరికా, రష్యా, బ్రిటన్‌, చైనా, ఫ్రాన్స్‌ శాశ్వత సభ్య దేశాలు కాగా- తాత్కాలిక సభ్య దేశాలు పది వరకు ఉన్నాయి. 2021 జనవరి ఒకటో తేదీ నుంచి రెండేళ్లపాటు భారత్‌ తాత్కాలిక సభ్యదేశంగా బాధ్యతలు స్వీకరిస్తుంది.

పెరగాల్సిన కార్యశీలత

భద్రతా మండలి శాంతి రక్షక దళాలను 1948లో ఏర్పాటు చేసి, అదే సంవత్సరంలో జరిగిన అరబ్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో కాల్పుల విరమణ విధులకు నియోగించారు. భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య, కొరియా ద్వీపకల్పంలోనూ యుద్ధాలు జరిగినప్పుడు, సూయెజ్‌ కాల్వ సంక్షోభంలోనూ శాంతి దళాలను పంపారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మండలి శాశ్వత సభ్య దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నందున శాంతి రక్షక విధుల నిర్వహణ కష్టమైంది. అగ్ర రాజ్యాలు సమితి సేనలను స్వప్రయోజనాలకు వాడుకున్నాయనే ఆరోపణలూ వచ్చాయి. ఉదాహరణకు 2011లో మానవ కారుణ్య దృష్టితో సమితి దళాలను లిబియాకు పంపారు. కానీ, అమెరికా ఆ దళాలను లిబియాలో గఢాఫీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఉపయోగించింది.

అంతకుముందు లిబియాలో సైనిక జోక్యానికి భద్రతా మండలి ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో భారత్‌ పాల్గొనలేదు. అప్పట్లో మండలిలో భారత్‌ తాత్కాలిక సభ్యురాలిగా ఉండేది. అయితే, మండలి తరఫున వివిధ దేశాల్లో మొత్తం 50 శాంతి రక్షక విధుల్లో పాల్గొంది. రెండు లక్షల మంది భారతీయ సైనికులను ఈ విధుల్లో వినియోగించింది. సమితి తరఫున శాంతి రక్షక విధులు నిర్వహించే అయిదు అగ్రగామి దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, రష్యాలు ఒకరి మీద ఒకరు పైచేయి సాధించడానికి పదే పదే వీటోలు ప్రయోగిస్తూ భద్రతా మండలి విధులకు భంగం కలిగించేవి. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక ఈ విభిన్న ధోరణి తొలగి, బహుళపక్ష కార్యాచరణ వీలుపడింది. భారత్‌, జపాన్‌, జర్మనీ వంటి దేశాల ప్రాధాన్యం పెరిగింది. ఐక్యరాజ్య సమితిని స్థాపించి 75 ఏళ్లు అయిన సందర్భంగా సంస్థ మరింత కార్యశీలంగా, అన్ని దేశాలనూ కలుపుకొని పోయే విధంగా రూపాంతరం చెందాలి. అందుకు తగిన సంస్కరణలు చేపట్టే విషయాన్ని లోతుగా పరిశీలించాలి. ప్రధాని మోదీ అన్నట్లు... ‘ఐక్యరాజ్యసమితికి, బహుళపక్ష కార్యాచరణకు కొత్త దశ, దిశలను ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది.’

హక్కుల ప్రకటనలో కీలకంగా భారత్‌

ఐరాస జనరల్‌ అసెంబ్లీ 1948లో వెలువరించిన మానవ హక్కుల ప్రకటన చాలా ముఖ్యమైనది. అప్పటికి కొత్తగా స్వాతంత్య్రం పొందిన భారతదేశం ఈ ప్రకటన రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది. భారత్‌ ఆ సమయంలో సొంత రాజ్యాంగ నిర్మాణంలో నిమగ్నమై ఉన్నందున ఐరాస మానవ హక్కుల ప్రకటన రూపకల్పనకు విలువైన సూచనలు సలహాలు ఇచ్చింది. ఈ ప్రకటన లౌకిక దృక్పథం, లింగ సమానతలకు పట్టం కట్టడం వెనుక హన్సా మెహతా, లక్ష్మీ మేనన్‌ అనే ఇద్దరు భారతీయ మహిళల కృషి ఉంది. ఉదాహరణకు మానవ హక్కుల ప్రకటనలో పురుషులంతా సమానులేనన్న పదబంధానికి వీరిద్దరూ అభ్యంతరపెట్టడంతో మానవులంతా సమానులే అని మార్చారు. ఐరాస మానవ హక్కుల ప్రకటన భారతీయ రాజ్యాంగ రచనకూ ఉపకరించింది. భారత న్యాయవ్యవస్థ ఇచ్చిన పలు తీర్పులకు ప్రాతిపదికనిచ్చింది.

- మొహిత్‌ ముసడ్డి (‘దిల్లీ పాలసీ గ్రూప్‌’ సంస్థలో పరిశోధకులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.