టీకా పంపిణీలో భాగంగా 30 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న అమెరికన్లలో.. 70 శాతం మంది తొలిడోసు అందుకున్నట్లు శ్వేతసౌధం మంగళవారం ప్రకటించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత విస్తృతం చేయనున్నట్లు స్పష్టం చేసింది. 18-26 ఏళ్ల వారికి టీకా అందించడంపై దృష్టి సారిస్తామని పేర్కొంది.
'బైడెన్ లక్ష్యం ముఖ్యం కాదు'
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ తేదీ (జూలై 4) నాటికి మొత్తం అమెరికన్లలో 70 శాతం మంది టీకా తొలిడోసు అందుకునేలా చేయలనేది అధ్యక్షుడు బైడెన్ లక్ష్యం. వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యం కావడం వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకోవడం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై స్పందించిన అధికారులు.. బైడెన్ లక్ష్యం తమకు ప్రధానం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ తమ అంచనా కన్నా వేగంగానే సాగుతోందని తెలిపారు. చాలా మంది రెండు డోసులూ తీసుకోవడం సహా కేసులు, మరణాల సంఖ్య కూడా తగ్గిందని తెలిపారు.
గత నెల రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించినట్లు సమాచారం. రోజుకి సగటున 3లక్షల మంది అమెరికన్లు తొలి డోసును తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి : Covid Vaccine: 'ప్రపంచానికి 5.5 కోట్ల డోసులిస్తాం'