Plane Crash: పెరూలో తేలికపాటి విమానం కూలి ఏడుగురు మృతి చెందారు. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నాజ్కాలోని వైమానికి కేంద్రానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.
ఆ విమానం పర్యటక సంస్థ ఏరో శాంటోస్కు చెందిందిగా గుర్తించారు. ప్రమాదం సమయంలో ఐదురుగురు పర్యటకులు, ఫైలట్, కోఫైలట్ ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది.
నాజ్కా లైన్లు ప్రసిద్ధి పర్యటక ప్రాంతం. 1,500-2,000 సంవత్సరాల క్రితం తీరప్రాంత ఎడారి ఉపరితలంపై గీసిన ఊహాత్మక బొమ్మలు, జీవులు, మొక్కల చిత్రాలే నాజ్కా లైన్లు. దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యూనెస్కో గుర్తించింది.
ఇదీ చూడండి: చుట్టూ కిలోమీటర్ల మేర మంచు.. మధ్యలో భారీ అగ్నిప్రమాదం